ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 4,147 కేసులు నమోదవ్వగా, 38 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,75,622 ఉండగా, ఇందులో 18,16,930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 46,126 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12,566 మంది మృతి చెందినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. Read: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! గడిచిన 24 గంటల్లో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 2021-22 కు సంబందించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనే సమగ్రసమాచారాన్ని పొందుపరచింది. ఈ జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబందించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది. Read: ‘అఖండ’ ప్రత్యేక గీతంలో రత్తాలు! పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోటీ పరీక్షలు…
నేడు విశాఖపట్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు మేయరు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్‌లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు…
గుంటూరు గ్యాంగ్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు కృష్ణ తల్లి మల్లీశ్వరి పరారైంది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి.. ఇద్దరు పిల్లలతోపాటు వెళ్లిపోయినట్టు సమాచారం. కృష్ణ ఆదేశాలతోనే తల్లి మల్లీశ్వరి పరారైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని రెండు బైకులపై నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. మరో నిందితుడు వెంకటరెడ్డి తల్లి, చెల్లి, భార్యను… ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అయితే ఆరు రోజులు గడుస్తున్నా… కృష్ణ,…
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని తెలిపారు.. కానీ, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నాకు నచ్చలేదు అన్నారు.. అయితే, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదన్నారు పెద్దిరెడ్డి.. కానీ, మాకు ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం…
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,71,475 కు చేరింది. ఇందులో 18,11,157 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 47,790 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది… అయితే, ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల జీవో ఉపసంహరించుకుని, పనులు అపి వస్తే చర్చలకు సిద్ధం అని ప్రకటించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సమైక్య రాష్ట్రంలో ఆనాడు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారని ఫైర్ అయ్యారు.. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఏపీ…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్…