తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని తెలిపారు.. కానీ, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నాకు నచ్చలేదు అన్నారు.. అయితే, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదన్నారు పెద్దిరెడ్డి.. కానీ, మాకు ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం చేవారు.. ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కేసీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో అంతా చూశారన్న ఆయన.. తెలంగాణ కూడా వెనక బడి ఉంది.. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు.. మా రాష్ట్రం వాట మేం వాడుకుంటామన్నారు.. మరోవైపు.. ఇవన్నీ సమస్య అనుకోవడం లేదన్న ఏపీ మంత్రి… సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారని. ఆయనకు అన్నీ విషయాలు తెలుసని..కానీ, ఎందుకు ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.