ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 4,147 కేసులు నమోదవ్వగా, 38 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,75,622 ఉండగా, ఇందులో 18,16,930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 46,126 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12,566 మంది మృతి చెందినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.
Read: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’!
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 96,121 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5773 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 838, పశ్చిమ గోదావరి జిల్లాలో 571, చిత్తూరు జిల్లాలో 569 కేసులు నమోదయ్యాయి.