కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ.. రేపటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు బుధవారం రోజు కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే, మంగళవారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… పరిశీలన వాయిదా వేశారు.. ఇక, జూలై 3వ తేదీన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది…
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ముగిసిన థియేటర్ల ఓపెనింగ్స్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు అవుతుండగా.. విడుదలకు రెడీగా వున్నా సినిమాలు థియేటర్లపై దూకేందుకు వెనకడుగు వేస్తున్నాయి. విడుదల తేదీలను సైతం ప్రకటించేందుకు సిద్దపడట్లేదు. తెలంగాణలో తెరలు తెరిచేందుకు పర్మిషన్ ఉండగా.. ఏపీలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే జులై లోనైనా పరిస్థితులు మారుతాయని అనుకొనే…
సింహాచలం భూముల్లో జరిగిన అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సింహాచలం దేవస్థానానికి గతంలో ఈవోగా పని చేసిన రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవదాయ శాఖ కమిషనర్.. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్‌పై అభియోగాలున్నాయి… ప్రస్తుతం దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్-2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్రమోహన్.. సర్కార్‌కు సరెండర్ చేశారు.. అయితే, ఈ వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరిగేందుకే రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు చెబుతున్నారు.…
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఇవాళ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు… వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయించాలని తెలిపారు. దీంతో.. అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న…
అమరావతి : అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు, రీ-సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీలో సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, సీఎం ముఖ్య సలహాదారు సజ్జల భేటీ అయ్యారు. అంతేకాదు… ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, ఎమ్మెల్యేల నుంచి సమావేశంలో అభిప్రయాలు, సూచనలు తీసుకున్నారు ధర్మాన, సజ్జల. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీలు పునరుద్దరించే అంశంపై కీలక సమీక్ష…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి ఆళ్లనాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మూడు గంటల పాటు చేసిన దీక్ష చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని.. చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ఆయన అసలు స్వరూపం బయట పడిందని.. ఆయన పరిపాలన లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రి, కొడుకులు హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 91,231 సాంపిల్స్ పరీక్షించగా.. 3,620 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 41 మంది కోవిడ్‌తో మృతిచెందారు.. చిత్తూరు జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో ఐదుగురు చొప్పున, గూంటురు,…
తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఈ చర్యలకు పూనుకుంది.. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655…
ఏపీ ప్రభుత్వం గతెడాది ఫిబ్రవరిలో దిశాయాప్‌ను రూపోందించి విడుదల చేసింది. దీనికి సంబందించి చట్టాన్ని, దిశా పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది. దిశా యాప్‌పై విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రతి మహిళ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇక ఈ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి… ఎలా ఉపయోగించాలో చూద్దాం. Read: అర్జున్ “ఆంజనేయస్వామి గుడి” ప్రారంభం..జులై 1న కుంభాభిషేకం. దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్…