ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది… అయితే, ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల జీవో ఉపసంహరించుకుని, పనులు అపి వస్తే చర్చలకు సిద్ధం అని ప్రకటించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సమైక్య రాష్ట్రంలో ఆనాడు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారని ఫైర్ అయ్యారు.. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
also read ఆనందయ్యకు మద్రాసు హైకోర్టు సెల్యూట్
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర నాయకులు ఆలోచించలేదన్నారు జగదీష్ రెడ్డి.. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్సార్ దోపిడీ చేశారని ఆరోపించిన ఆయన.. ఇవాళ మాట్లాడుతున్న నాయకులందరూ వైఎస్సార్ వెంట ఉండి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. తెలంగాణను దోచుకునే విషయం వచ్చేసరికి ఆంధ్రా నేతలందరూ ఒక్కటి అవుతున్నారని.. వాళ్లను చూసి తెలంగాణ ప్రతిపక్షాలు నేర్చుకోవాలని హితవుపలికారు.. చట్టం- రాజ్యాంగం ప్రకారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తుందన్న ఆయన.. జాతీయ పార్టీలు ఎప్పుడూ తెలంగాణ కోసం కొట్లాడలేదన్నారు.. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఆకలి చావులు కొనసాగుతుండేవన్నారు. ఇక, కేంద్రం పక్షపాత ధోరణి కనిపిస్తుందన్న జగదీష్ రెడ్డి.. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం, ఏపీ ఒక్కటే అన్నట్టు కనిపిస్తుందని ఆరోపించారు.