మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దిశాయాప్‌ను రూపోందించింది. ఈ యాప్ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణాజిల్లాలోని గొల్లపూడిలో దిశాయాప్ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం రూపోందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుందని, ప్రతి మహిళ దిశాయాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. Read: ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేదం… అతిక్రమిస్తే జైలు శిక్ష… దిశాయాప్‌పై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని తెలిపారు.…
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కారణంగా వేలాది మంది ఇప్పటికే మృతి చెందారు. లక్షలాది మంది కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీడీపీ సాధన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు సాధన దీక్షలు చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఉదయం 11 గంటల…
అమరావతి : కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 ద్వారా పిల్లలకు చికిత్స 24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్ టెలీ సేవలు తీసుకు రావాలని..అలాగే 150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలని… ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలని…
ఫేక్ న్యూస్‌పై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా పత్రికా కథనాలను ప్రస్తావిస్తూ.. తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు సీఎం.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో రాష్ట్రానికి మంచిపేరు వచ్చిందనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటివెనుక ఉద్దేశమని విమర్శించిన సీఎం… అందుబాటులో 70 శాతానికి పైగా ఆక్సిజన్ బెడ్లు, 70 శాతానికిపైగా వెంటిలేటర్లు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్నారని ఎలా రాయగలుగుతున్నారు?…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,758 సాంపిల్స్ పరీక్షించగా… 2,224 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఇక, విశాఖ, విజయనగరం జిల్లాలో…
పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన…
ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయడానికి సమయం ఇచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలించారు. ఈ జిల్లాల్లో సాయంత్రం…
ఆంధ్రప్రదేశ్ క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 4,250 పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి.. మరో 33 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 5,570 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రం నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,76,977కు చేరుకోగా… రికవరీ కేసులు సంఖ్య 18,19,605కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారు 12,599 మంది…