Gold And Silver: గత వారం రోజులుగా భారీగా పెరుగిన బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్ 13న) ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రేట్లు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వీకెండ్ లో షాపింగ్ చేయాలని అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తాజా రేట్లను పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి 1,33,910గా ఉండగా.. ఇక, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.250 తగ్గి, 1,22,750 వద్ద కొనసాగుతుంది.
Read Also: Kusuma Krishnamurthy: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర..
* హైదరాదాబాద్ లో రూ.13వేల 391
* విజయవాడలో రూ.13వేల 391
* విశాఖలో రూ.13వేల 391
22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర..
* హైదరాదాబాద్ లో రూ.12వేల 275
* విజయవాడలో రూ.12వేల 275
*విశాఖలో రూ.12వేల 275
అయితే, బంగారం ధరలతో పాటు మరొ పక్క వెండి రేట్లు పతనం అవుతున్నాయి. ఇవాళ (డిసెంబర్ 13న) కిలో వెండి రూ.6 వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి 1 లక్ష 98 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి ధర 198 రూపాయలకు విక్రయాలు జరుపున్నారు.