ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 66,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1578 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 22 మంది మృతిచెందారు..
read also : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్
మరోవైపు.. 24 గంటల్లో 3,041 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421 కు చేరుగా.. ఇప్పటి వరకు 13,024 మంది మృతి చెందారు.. రికవరీ కేసులు 18,81,307 కు పెరగగా.. ప్రస్తుతం 27,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి.