చంద్రబాబు రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని.. చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్ 2023 లోపు పూర్తి చేస్తామన్న ఆయన.. ప్రకాశం జిల్లాకు నీళ్ళందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకు నీరందించే కార్యక్రమం చేస్తున్నామని.. ఉత్తరాంధ్రలోనూ నీరందించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారి.. ఆయన అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుంటే…చంద్రబాబు చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు తర్వాత 2015లో తెలంగాణలో ప్రాజెక్టులు చేపట్టింది నిజం కాదా…? అని ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్.. ఆ రోజే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ చేపట్టి ఉంటే ఈ రోజు అన్యాయం జరిగేది కాదన్న ఆయన.. తెలంగాణ వాదాన్ని చంద్రబాబు ఈ రాష్ట్రంలో వినిపిస్తున్నారు అని ఆరోపించారు.. కరువుతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో కేసులు వేయించించిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది కాదా? అంటూ ఫైర్ అయిన ఆయన.. బాబు సొంత జిల్లాలో జలాశయం కడితే ఓర్చుకోలేక కేసు వేయించారన్నారు.. ఈ రాష్ట్రానికి చంద్రబాబుతో సహా కొన్ని మీడియా సంస్థలు కూడా దెయ్యాల్లా తయారయ్యానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ ప్రాజెక్టులు చేపట్టి ఏడాదిన్నర తర్వాత వీళ్ళు ఇప్పుడు మాట్లాడటమేంటి..? అని ప్రశ్నించిన అనిల్.. ఈ రోజు తెలంగాణ మాట్లాడుతున్న దానికి వీళ్ళు వంత పాడుతున్నారని.. అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి సంబంధించి మీ విధానం ఏమిటి…? రాయలసీమ లిఫ్ట్ గురించి మీ వైఖరి ఏమిటి…? తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై మీ వైఖరి ఏమిటి…?.. చంద్రబాబు స్పష్టమైన విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.