అమరావతి : ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీని జగన్ సర్కార్ విడుదల చేసింది.. 2021-26 కాలానికి రిటైల్ పార్క్స్ పాలసీని రూపొందించిన ఏపీ ప్రభుత్వం… ఏపీలో రిటైల్ రంగానికి ఊతమిచ్చేలా పాలసీ రూపకల్పన చేసింది. రిటైల్ రంగంలో పెట్టుబడులు.. ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలసీని రూపొందించిన జగన్ సర్కార్… వచ్చే ఐదేళ్ల కాలంలో రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టే విధంగా రిటైల్ పార్క్స్ పాలసీ రూపకల్పన చేయనుంది. read also…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై ఇరురాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల మధ్య నీటి పంచాయితీకి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆకతాయి పిల్లాడిలా వ్యవహరించి , కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనంకు నిదర్శనం అన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా జీవో 203 ను ఉపసహరించుకోవాలి. పొరుగు రాష్ట్రం స్నేహ హస్తం ఇచ్చినా దాన్ని…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… భారీ సంఖ్యలో టెస్ట్లు చేస్తున్నా.. పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,785 శాంపిల్స్ పరీక్షించగా.. 2,526 మంది పాజిటివ్గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున,…
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా హత్య కేసులో 39వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులు ఎవరు అన్నది తేల్చటం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. కాగా, ఈ కేసులో కొత్త కొత్త పేర్లు తెరమీదకు రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఎర్రగంగిరెడ్డి, అతని సోదరుడు సిద్దారెడ్డి సీబీఐ విచారణకు హాజరైనారు. మరో…
రాజకీయాలను వదిలేసి.. వచ్చిన దారినే వెళ్లిపోదామని అనుకున్నారు. ఇంతలోనే పెద్ద పదవి వరించింది. ఆ సంతోష సమయంలోనే కాలాంతకుల చేతికి చిక్కారు. పోలీసులూ చుక్కలు చూపిస్తున్నారట. ఏం జరుగుతుందో తెలియక తలపట్టుకున్నారు ఆ ప్రజాప్రతినిధి. వైసీపీలో చర్చగా మారిన ఆ నాయకుడెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్సీ అయిన సంతోషం ఆవిరి.. వరస కష్టాలు! ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆర్.రమేష్ యాదవ్కు వరస కష్టాలు కలవర పెడుతున్నాయి. ప్రొద్దటూరు…
అప్పులు అందులోని తప్పులపై వైసీపీ.. టీడీపీ మధ్య ఫైట్ జరుగుతోంది. పీఏసీ ఛైర్మన్ ఆరోపణల తర్వాత ఈ రగడ పీక్కు వెళ్లింది. ఇంతలో బీజేపీ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా లేక.. రెస్క్యూకి వచ్చారా అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ కమలనాథుడి లేఖ ఆంతర్యం ఏంటి? గవర్నర్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ రాసిన లేఖపై చర్చ! ఏపీ ఆర్థిక వ్యవహారాలపై గవర్నర్ను కలిసి PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేసిన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్… అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.. కాగా, 2019లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రాజ్యాంగ సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు,…
ఓవైపు విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్సైడ్ట్రేడిరగ్ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్ఐఆర్ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్ వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా…
ఆయనో యువ ఎమ్మెల్యే. రాజకీయ ఉద్ధండులకు దక్కని అవకాశం లభించింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సాధించామని సంబరాలు చేసుకుంది ఎమ్మెల్యే వర్గం. అంతా ఓకే అనుకున్న వేళ కిరికిరి మొదలైంది. దీంతో ఉపేక్షించకూదని భావిస్తున్న ఆ యువ ఎమ్మెల్యే.. తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. అట్టహాసంగా మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన విశాఖ జిల్లా రాజకీయాల్లో అనకాపల్లిది సెపరేట్ స్టైల్. ఇక్కడ పాలిటిక్స్ అన్నీ సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంటాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రులు కొణతాల…