రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ ధిక్కరణ పిటిషన్‌ను ఎన్జీటీలో ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ తరఫున ప్రస్తావించారు ఏఏజీ రామచందర్‌రావు. గతంలో ధిక్కరణ పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్… ఎన్జీటీలో నేడు విచారణకు రాలేదు. దీంతో ధిక్కరణ పిటిషన్ వేశామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ ఏఏజీ రామచందర్‌రావు. నేడు నివేదిక సమర్పించాల్సి ఉన్న కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన నివేదికను ఎన్జీటీ ఇవ్వాలని పేర్కొంది.
read also : ఏకగ్రీవంగా పెద్దలు ఎన్నుకుంటే పోటీ నుండి తప్పుకుంటా: మంచు విష్ణు
అయితే… దీనిపై స్పందించిన తెలంగాణ… తనిఖీ చేయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఎన్జీటీకి తెలిపింది. ఏపీ అడ్డుకోవడంతో నివేదిక ఇవ్వలేదని ఎన్జీటీకి తెలిపారు ఏఏజీ. స్వయంగా ఎన్జీటీనే తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఏఏజీ రామచందర్‌రావు. శ్రీనివాస్, తెలంగాణ ధిక్కరణ పిటిషన్లను కలిపి విచారణ జరపాలని కోరారు ఏఏజీ. రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందని చెప్పిన ఎన్జీటీ… జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.