Marry Now Pay Later: పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేకపోయినా, ఎలాంటి టెన్షన్ లేకుండా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవచ్చని, ఖర్చు తాము చూసుకుంటామని ప్రస్తుత ఫిన్‌టెక్ కంపెనీలు సరికొత్త ఆఫర్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ కంపెనీలు ‘మ్యారీ నౌ పే లేటర్’ అనే ఆఫర్‌తో వెడ్డింగ్ లోన్లను అందిస్తున్నాయి. ఒకప్పుడు సాదాసీదాగా జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు ధూమ్‌ధామ్‌గా, బ్యాండ్ బాజా, వెడ్డింగ్ షూట్‌లతో అద్దిరిపోయేలా జరుపుకుంటున్నారు. ఈ ఖర్చు ఎంతైనా సరే రాజీ పడకూడదనుకునేవారు డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరీ పెళ్లిని ఘనంగా చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు సైతం పెళ్లికి సగటున 25 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు.
IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో 39 ఏళ్ల స్పిన్నర్.. పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు!
ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఫిన్‌టెక్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇవి యాప్ ఆధారిత తక్షణ (Instant) లోన్లను అందిస్తున్నాయి, వీటి ప్రాసెస్ చాలా సులభంగా ఉండటం, షూరిటీ లేదా ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో ప్రజలు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ‘మ్యారీ నౌ పే లేటర్’ స్కీమ్ కింద తీసుకునే లోన్‌కు సిబిల్ స్కోరుతో కూడా పనిలేదు.. కేవలం అడ్రస్, పాన్ నెంబర్ వంటి వివరాలు ఇస్తే సరిపోతుంది. కావలసిన లోన్ తీసుకొని, దాన్ని సులభంగా ఈఎంఐ (EMI)గా మార్చుకుని చెల్లించవచ్చు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది.
అంతేకాదు, ఫిన్‌టెక్ కంపెనీలతో టైఅప్ అవ్వడం ద్వారా లేదా సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా కన్వెన్షన్ సెంటర్‌లు, మ్యారేజ్ బ్యూరోలు, ఫంక్షన్ హాళ్లు సైతం లోన్ ప్రొవైడర్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా, కొన్ని కంపెనీలు 12 నెలల ఈఎంఐ ప్లాన్‌కు వడ్డీ కూడా లేకుండా దిమ్మతిరిగే ఆఫర్లు ఇస్తున్నాయి. ఒకప్పుడు అప్పు తెచ్చి పెళ్లి చేసేవారు, కానీ ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేకుండా ఇంటికి వచ్చి మరీ పెళ్లి కోసం లోన్లు ఇస్తున్నారు.