ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టం నుండి ఒక తూర్పు పడమర ద్రోణి.. ఉత్తర అరేబియా సముద్రం నుండి దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ మీదుగా & ఉత్తర మహారాష్ట్ర మరియు తెలంగాణ మీదుగా 3.1 కి.మీ & 4.5 కి.మీ.ల మధ్య ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 21 న వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడన…
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు.. గతంలో ఉన్న జోడు పదవులు విధానానికి గుడ్‌బై చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్… నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు పెద్దపీట వేశారు.. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించారు.. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు, పురుషులకు 67 పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కట్టబెట్టారు.. పదవులు అలంకార ప్రాయం కాదని.. సామాజిక న్యాయానికి…
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది… పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శోభాహైమావతి.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. 1999-2004 మధ్య ఎస్.కోట ఎమ్మెల్యేగా పని చేసిన హైమావతి… గత ఎన్నికల కంటే ముందు వరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు.. పార్టీల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. అయితే, ప్రస్తుతంలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోవడానికి తోడు… టీడీపీలో అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువైనట్టుగా…
ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.…
2021-24 ఐటీ పాలసీ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఐటీ పాలసీ రూపకల్పన చేశారు.. ఇన్క్యూబేషన్ సెంటర్లు, స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది సర్కార్.. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.. రానున్న పదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పన్నుల రూపంలో రూ. 783 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఐటీ…
నామినేటెడ్ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.. వారి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తుండగా.. ఇప్పుడు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది.. నిరుద్యోగులకు అండగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేసిన జనసేనాని… లక్షల్లో ఉద్యోగాలు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో కొనసాగుతూనే ఉంది.. కేంద్రం గెజిట్లు విడుదల చేసినా.. మంత్రులు, నేతల మధ్య హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జల జగడం విషయంలో స్పందిస్తూ.. ఎన్నికల కోసమో, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కోసమో.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం తెలంగాణకి మంచి పద్దతికాదని హితవుపలికారు.. ఏపీకి రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క తగ్గినా ఒప్పుకోమని స్పష్టం చేసిన ఆయన..…