Ambati Rambabu: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ప్రజా ఉద్యమం తీరును అందరూ చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. గత 18 నెలల కాలంగా వైసీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని తెలిపారు.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు.. తాజాగా వైసీపీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో అంబటి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసం పీపీపీ అనే దుర్మార్గమైన మోడల్ తెచ్చి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో కోటి సంతకాలను సేకరించాలని ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్ళిందని విమర్శించారు.. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయన్నారు.. ప్రతి జిల్లాలో వైసీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారన్నారు.. రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండకూడదని భర్తీ చేశారని తెలిపారు.. ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు.. ప్రజారోగ్యం, విద్య కోసం 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు..
READ MORE: Marry Now Pay Later: పెళ్లిళ్లకు లోన్లు ఇస్తున్న ఫిన్టెక్ కంపెనీలు
ఈనెల 18న గవర్నర్ దగ్గరకు వెళ్ళి ఈ సంతకాల రూపంలో ఉన్న ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.. “గతంలో మేం సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటేనే అలా కదరదన్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తున్నారు.. ప్రైవేట్ వాళ్లకు ఇచ్చినా సిబ్బంది జీతాలు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుందట.. ఇది వారికి బొనాంజా ఇచ్చే స్కాం కాదా.. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు.. 33 ఏళ్ల లీజు.. ఆ తర్వాత పొడిగించుకునే అవకాశం.. ఐదేళ్ల పాటు 1000 కోట్లు వ్యయం చేస్తే పేదవారికి ఉపయోగపడతాయి.. ప్రతి దశలో ప్రైవేటీకరణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారు.. పార్లమెంట్ స్థాయి సంఘం నివేదికలు సైతం వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. పార్లమెంటరీ స్థాయి సంఘం దేశంలో వైద్య కళాశాలలు మరిన్ని రావాలని చెప్పే ప్రయత్నం చేసింది.. రానున్న రోజుల్లో 70 వేల సీట్లు అందుబాటులోకి రావాలని చెప్పారు.. పీపీపీ విధానంలో పన్ను రాయితీ ఇవ్వనున్నారు కానీ ఏకంగా వాళ్లకు కట్టబెట్టమనలేదు.. ఇవాళ వైసీపీ కోటి సంతకాలు అని మొదలు పెడితే దాటిపోయాయి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం మానుకోవాలి.. 18 నెలల్లో ప్రజా వ్యతిరేకత పెరిగిందని వారు గమనించకపోతే వారి కర్మ.. ఇప్పటికైనా చంద్రబాబు పీపీపీ పై పునరాలోచించుకోవాలి.. గవర్నర్ రాష్ట్రానికి సుప్రీం కాబట్టి ఆయనకు ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం..” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.