తూర్పుగోదావరి జిల్లా : గోదావరి వరద ప్రవాహం శాంతించినట్లు కనిపిస్తోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలలో శాంతించి క్రమంగా తగ్గుముఖం పట్టింది వరద. ఇక అటు పి.గన్నవరం మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు
అధికారులు ఏర్పాటు చేసిన రెండు ఇంజన్ పడవలపైనే ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం కనకాయలంక కాజ్‌వేపై వరద ఉధృతి కొనసాగడంతో ఇంజన్‌బోట్ల పైనే లంక గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనగార్లంక, పెదమల్లంక, అయోధ్యలంక గ్రామస్తులు కూడా పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. లోతట్టు లంక ప్రాంతాల్లో పలుచోట్ల మునగ, బీర, పచ్చిమిర్చి పంటలకు వరదపోటు తప్పలేదు. ఒక్కసారి వరదనీరు తాకితే పంటలు పనికిరావని రైతులు గగ్గోలు పెడుతున్నారు.