వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 71వ రోజు విచారణలో భాగంగా వైఎస్ కుటుంబంలోని వైఎస్ ప్రకాశ్‌రెడ్డిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారిస్తుంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో జరుగుతోన్న ఈ విచారణలో వివేక హత్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకాకు ఏమైనా ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు, చంపుకునేంత వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా, వైఎస్ కుటుంబంలో పెద్ద వయసు గల వ్యక్తి వైఎస్…
ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పొరుగునున్న రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్ని అవలంభించాలని భావించింది ప్రభుత్వం. దాంతో ఇకపై పబ్లిక్ డొమైనులో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైనుల్లో ఉత్తర్వులు ఉంచడం 2008 న ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేసింది. చూడాలి మరి ఇంకా…
ప్రేమ పేరుతో అమ్మాయిలను బలితీసుకుంటూనే ఉన్నారు దుర్మార్గులు. ఎన్ని శిక్షలు వేసిన ఉన్మాదుల ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పరమాయకుంట. అక్కడికి బైకుపై బీటెక్ విద్యార్థిని రమ్యతోపాటు శశికృష్ణ వచ్చాడు. అప్పటివరకూ బాగానే మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య శశిని…
కరోనా కారణంగా ఏడాదిన్నరగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆ మధ్యలో తెరుచుకున్నా వైరస్ మళ్లీ విజృంభించడంతో మరొసారి విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఏపీలో స్కూళ్లు పునప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.కరోనా కష్టాలు, సవాళ్లు అన్నింటినీ అధిగమించి.. పాఠశాలల ప్రారంభానికి రెడీ అయింది ప్రభుత్వం. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు.. తరగతుల నిర్వహణపై…
నాడు-నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రూపుదిద్దుకున్న ఓ పాఠశాలను నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే జగనన్న విద్యాకానుకకు ఇక్కడే శ్రీకారంచుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 32 వేల మంది విద్యార్థులకు… ఈ విద్యా కానుకను అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు,…
గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని గౌతం సవాంగ్ తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని ఆయన తెలిపారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని..…
తిరుపతిలోని శ్రీకాళహస్తి పట్టణ శివారులో ‘జగనన్న నవరత్నాలు గుడి’ పేరిట ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓ ఆలయ నిర్మాణం చేశారు. సీఎం జగన్ చేపట్టిన నవరత్నాల గురించి వివరిస్తూ వినూత్న రీతిలో ఎమ్మెల్యే ఈ గుడి నిర్మాణం చేపట్టారు. జగనన్న ఇళ్లు పథకం కింద రెండు వేల మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించిన స్థలంలోనే ఎమ్మెల్యే గుడి నిర్మించారు. రేపు జిల్లా మంత్రుల చేతుల మీదుగా నవరత్నాల గుడి ప్రారంభోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్…
చదువుకున్నవాళ్లు విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు.. ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది.. కానీ, మనదేశానికి వారు సేవలు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేసిన ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇతర దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు.. మన దేశానికి సేవ చేయకపోవడానికి మన రాజకీయ…