ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 67,716 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,501 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 10 మంది మృతిచెందారు. మరోవైపు.. 24 గంటల్లో 1,697 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఆంధ్ర ప్రదేశ్ కరోనా కారణంగా 6800 మంది చిన్నారులు ఇబ్బందుల్లో పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కొల్పోయిన వారు 6800 మంది చిన్నారులన్నట్టు తెలిపింది. అయితే ఇప్పటివరకు 4033 మంది పిల్లల వివరాలను సేకరించిన ప్రభుత్వం. ఇక అందులో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టుగా గుర్తించిన విద్యాశాఖ… 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టు గుర్తించింది. మిగిలిన 524 మంది శిశువులుగా పేర్కొంది అయితే కోవిడ్ సమయంలో…
రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్న సీఎం… జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు సీఎం. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం… ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక…
కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పివేయగా పక్కనే ఉన్న మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయగా మూడో ఇంట్లోకూడా అదే విధంగా మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. ఇంట్లోని వస్తువులను బయటపడేసి బయటే కూర్చుండిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరులోని ఒకటో వార్డులో జరిగింది. ఈ వార్డులో నివశించే ఖాజావలి,…
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. కేంద్రమంత్రి అయిన తర్వాత జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, ఈ సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పులతో ఏపీలో పాలనా జరిగితే.. కేంద్ర నిధులతో ఏపీలో…
మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.? అంతా ఏకమయ్యే అజెండాపై ప్రతిపక్షాలు ఫోకస్? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు ఒకే గూటికి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,041 సాంపిల్స్ పరీక్షించగా.. 1,433 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,815 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు పెరగగా… రికవరీ కేసులు 19,67,472కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,686…
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ పిల్ పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారన్నారు పిటిషనర్.…
కర్నూలు ఆలూరు మండలం హులేబీడు, తుమ్మల బీడు గ్రామాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. మోహరం వేడుకల వివాదంతో ఈ ఘర్షణ జరిగింది. తుమ్మలబీడు పీరులు హులేబీడు రావడం అక్కడి ఆనవాయితీ. కానీ ఈసారి తుమ్మల బీడు స్వామి హులేబీడు కు రాకూడదని స్థానికులు ఆంక్షలు విధించారు. కానీ ఆనవాయితీ ప్రకారం తుమ్మలబీడు పీరులు హులేబీడు లోకి రావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు పరస్పర దాడులకు పాల్పడటంతో పలువురికి…
శ్రీశైల మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. ఇవాళ్టి నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. అయితేచ, కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్లైన్, కరెంటు బుకింగ్ ద్వారా…