ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పొరుగునున్న రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్ని అవలంభించాలని భావించింది ప్రభుత్వం. దాంతో ఇకపై పబ్లిక్ డొమైనులో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైనుల్లో ఉత్తర్వులు ఉంచడం 2008 న ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేసింది. చూడాలి మరి ఇంకా ఆఫ్ లైన్ లో ఆ వివరాలను ప్రజలకు ఏ విధంగా అందిస్తుంది అనేది.