వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని…
ఆయనో మంత్రి. జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తారని టాక్. ఇతర జిల్లాల్లో నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమన్నది తక్కువే. అలాంటిది ఆ కార్యక్రమంలో మాత్రం ఆసాంతం దగ్గరున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్? ఎవరా మంత్రి? నిర్మలా సీతారామన్ టూర్‌పై ఏపీ ఆర్థికశాఖలో చర్చ! ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పీకల్లోతు ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ అప్పు దొరుకుతుందా.. అని ఆర్థికశాఖ దారులు వెతుకుతున్న పరిస్థితి. కేంద్రం వీలైనంత మేర…
వివిధ శాఖల సెక్రటరీలతో ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ భేటీ అయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పథకాల అమలు.. కేంద్ర నిధుల వినియోగంపై చర్చించారు. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల హాజరుపై సీఎస్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. సెక్రటేరీయేట్టుకు ఉన్నతాధికారులు రాకుంటే పరిపాలన గాడి తప్పుతుందని అభిప్రాయపడ్డ సీఎస్… ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలంటే ఉన్నతాధికారులు సచివాలయానికి రావాలన్నారు. హెచ్‌వోడీ, క్యాంప్ ఆఫీసుల నుంచి పని చేసే విధానానికి సెక్రటరీలు స్వస్తి పలకాలని ఆదేశించారు.…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,341 సాంపిల్స్ పరీక్షించగా.. 1,746 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 20 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,648 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,58,275 కి చేరింది..…
ఉద్యోగాల భర్తీ వైపు జగన్ సర్కార్ ఒక్కో అడుగూ వేస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా భారీగా ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం.. తాజాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత నెలలోనే ఏపీపీఎస్సీ నుంచి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. కానీ, ఈ విషయంలో చిన్నపాటి సాంకేతిక అడ్డంకిని ఏపీపీఎస్సీ గుర్తించింది. Read: పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్…
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 15 తర్వాత పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 15 నాటికి బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడుతుందని, అది బలపడి 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో, ఇటు హైదరాబాద్ ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో…
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న సినిమాలు తీస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అమీర్ ఖాన్. అయితే.. ఈ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజాగా ఏపీలో పర్యటించారు. షూటింగ్ నిమిత్తం కాకినాడకు విచ్చేశారు హీరో అమీర్ ఖాన్. “లాల్ సింగ్ చద్ద” అనే సినిమా షూటింగ్ నిమిత్తం అమీర్ ఖాన్ కాకినాడ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ చేరుకున్న అమీర్ ఖాన్ కాసరోవర్…
కేంద్రమంత్రి వస్తున్నారని వారంరోజుల ముందు నుంచే హడావిడి చేశారు. బోలుడన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కూడా. తీరా.. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి వచ్చాక.. లెక్కలు చెప్పలేక తడబడ్డారు. సీనియర్లు అనుకున్నవారే గుడ్లు తేలేశారు. కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలపై చర్చ! శ్రీకాకుళం జిల్లాలో ఖద్దరుకు పేరొందిన పొందూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఎన్నోఏళ్లుగా ఆదరణ లేకుండా పోయిన పొందూరు ఖాదీ, ఖద్దరు పరిశ్రమకు ఆమె పర్యటనతో దశ తిరిగిపోతుందని భావించారు సిక్కోలు…