గుంటూరు నగరం కాకాణి రోడ్డు దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె మూడ సంవత్సరం చదువుతోంది. అయితే… ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న రమ్యను చూసి… కత్తితో దాడిచేసి హతమర్చాడు. అయితే.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు పోలీసులు. ఇది…
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఏపీ సీజే అరూప్ గోస్వామి.. హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజే అరూప్ గోస్వామి.. జాతీయ జెండాకు వందనం చేశారు.. ఈ కార్యక్రమానికి జడ్జీలు, ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం తదితరులు హాజరు కాగా.. ఈ సందర్భంగా జస్టిస్ అరూప్ గోస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగఫలాలను…
కరోనా కట్టడి కోసం రకరకాల చర్యలకు పూనుకున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా కర్ఫ్యూ విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… కేసుల తీవ్రతను బట్టి.. కర్ఫ్యూ విధించిన సర్కార్.. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో.. నైట్ కర్ఫ్యూకు వెళ్లిపోయింది.. అయితే, తాజాగా మరో వారం రోజుల పాటు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించింది సర్కార్… రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది…
ఏపీలో రేపట్నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన స్కూళ్లు.. మళ్లీ తెరుచుకోనున్నాయి. దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అయితే, పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు మాత్రం భయపడుతున్నారు. దీంతో, గుంటూరు జిల్లాలో స్కూల్స్ ఓపెనింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తి కరోనా నిబంధలు పాటిస్తామని చెబుతున్నారు. అయితే కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నవేళ.. స్కూల్స్ తెరవకపోవడమే బెటరంటున్నారు విద్యార్థుల తల్లితండ్రులు. Read Also : “భీమ్లా నాయక్”…
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చివరల్లో ఉద్యోగాల జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామన్నారు.. చాలీ చాలని జీతంతో ఉన్న చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచామని.. ఉద్యోగులకు…
దేవాదాయశాఖ పేరు వింటేనే పవిత్రభావం కలగాలి. కానీ.. అక్కడ జరగని అరాచకం లేదు. అలా జరగకుండా చూడాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. మహాఅయితే తూతూ మంత్రంగా మమ అనిపించేస్తున్నారు. క్రమశిక్షణ ఉండాల్సిన శాఖ కట్టుతప్పడానికి రాజకీయ అండదండలేనట. వివాదాస్పదంగా మారిన వారిపై చర్యలు తీసుకోవడానికి పైవాళ్లు జడిసే స్థాయిలో నేతల మద్దతును వీళ్లు కూడగట్టారట. దేవాదాయశాఖలో తప్పు జరిగితే చర్యలు ఉండవ్! ఏపీ దేవాదాయశాఖ గాడి తప్పిందా? ఏదో ఒక గొడవ లేదా ఇంకేదో వివాదం..…
ఉద్యోగులకు చెందిన వివిధ పెండింగ్ సమస్యలపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల బదిలీ పాలసీపై చర్చ జరిపారు. సీపీఎస్ రద్దు సాధ్య సాధ్యాలపై సమీక్ష చేసారు. సీపీఎస్ రద్దుని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆందోళనలకు ఉద్యోగులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారనే అంశం భేటీలో ప్రస్తావన వచ్చింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలనే ప్రతిపాదన…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 69,088 శాంపిల్స్ పరీక్షించగా.. 1,535 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,075 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,92,191కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 19,60,350కు చేరింది. ఇక, ఇప్పటి వరకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని వైద్య అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. ఏపీకి అదనపు వ్యాక్సిన్ డోసులు అందడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. కాగా…రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్ పరీక్షించగా..…