ఒక్కో నేత ఒక్కోటైపు. కొంతమంది నోటికి పని చెప్తే.. మరికొందరు మైండ్‌కి పని చెబుతారు. ఏపీలో ఓ మంత్రి రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందిని అవమానించిన అధికారికి గాంధేయ పద్ధతిలో ట్రీట్ ఇచ్చారు ఆ మంత్రి. ఎవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మంత్రి ఖరీదైన ప్లేట్‌మీల్స్‌పై చర్చ! ఒక్కపూట భోజనానికి రెండున్నర వేలు. అధికారికవర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. పూట భోజనానికి రెండున్నర వేలు ఖర్చు పెట్టిన మంత్రి పేర్ని నాని గురించి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.. ఒకే పోలీస్ స్టేషన్లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. అయితే, సీఐ, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది…
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. నిన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. ఈరోజు మళ్ళీ పెరిగాయి.. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,063 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…11 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 1,929 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,341 గా…
మహిళల భద్రత కోసం దిశా చట్టాన్ని తీసుకుని వచ్చాం. ఈ చట్టం వచ్చిన తర్వాత విచారణ, శిక్ష ఖరారు వేగంగా జరుగుతోంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. 2019లో 100 రోజుల్లో విచారణ పూర్తి చేస్తే ఈ ఏడాదిలో 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసే పరిస్థితి ఉంది. 2,114 కేసులను 40 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు వాళ్ళు కూడా అమల్లోకి…
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష.. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదిల్లో జరుగుతుంది. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) ద్వారా పరిక్షలు నిర్వహణ జరుగుతుంది. మొత్తం 16 సెషన్లలో పరీక్షలు నిర్వహణ ఉంటుంది. అందులో ఇంజనీరింగ్ 10, అగ్రికల్చర్, ఫార్మసీ…
సీఎం జగన్ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తు అయితే.. జీవోలను ఆన్లైన్లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తుగా కనిపిస్తోంది. GOIR వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఈ ఆనవాయితీని జగన్ సర్కార్ పక్కకు పెట్టింది. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు మెమో పంపింది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైనులో పెట్టకూడదని డిసైడ్ అయినట్టు…
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ఈ నెల 27న జరగనున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇప్పటికే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా సమావేశం నిర్వహించగా.. ఈ నెల 27వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నామని.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఇక, నోటీసులతో భేటీ అజెండాను జతపరిచిన కేఆర్ఎంబీ.. కృష్ణాజలాల్లో రాష్ట్రాల వాటా, అజెండాలో…
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో మార్పులు చేసుకోగా.. ఈ నెల 18 నుంచి స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు ప్రకటించారు.. ఇక, ప్రతిరోజు గర్భాలయంలో ఏడు విడతలుగా అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. కోవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని పేర్కొన్నారు.. వేదాశీర్వచనాలు, నవావరణ…
రాగల 24 గంటల్లో వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడనుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కావున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు అని…