ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం తీవ్ర రూపు దాల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సత్యకుమార్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.నేడు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు.. వేడుకలకు ససేమిరా అంటున్నారు అధికారులు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను..బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ…
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా అంబర్పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర…
గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీలో ఆందోళన చేపట్టింది. కర్నూలు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు… కలెక్టర్ ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డిసహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను బలవంతంగా స్టేషన్‌కి తరలించారు పోలీసులు. కాగా… ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన సోమువీర్రాజు… ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పై ఏపీ సర్కార్…
లెక్కలేనన్ని పథకాలు..నెలనెలా ఇంటికే డబ్బులు. ఇళ్లు, స్థలాలు..ఒకటేమిటి.. అసలు సిసలు సంక్షేమ రాజ్యం అంటే ఏంటో ఏపీలోనే చూడాలన్నట్టు ప్రభుత్వం ఉంది. అసంతృప్తి అనేదే లేని జనం మా దగ్గర ఉన్నారని అధికార పార్టీ ఘనంగా చెప్పుకుంటుంటే, పాపం ఎమ్మెల్యేలు మాత్రం లబోదిబో అంటున్నారట. ప్రజలంతా హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రాబ్లం ఏమిటనుకుంటున్నారా? అయితే చూడండి.. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2 సీటత్లు మినహీఆ అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దానికి తగ్గట్టుగానే…
వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు…
శ్రీకాకుళం : ఆమదాలవలసలో జనసేన శ్రేణుల పై వైసీపీ దాడిని ఖండించారు పవన్ కళ్యాణ్. దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ. రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా? పోలీసుల సమక్షంలోనే ఆమదాలవలస జనసేన నాయకుడు రామ్మోహన్ రావు పై దాడి చేశారని పవన్ ఫైర్ అయ్యారు. సమస్యను తెలియజేసిన వారిని గాయపరిచి ఎదురు కేసులు పెడతారా ? జనసేన శ్రేణుల పై దాడులు చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం…
వినాయక చవితి నేపధ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మండిపడ్డారు. సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అద్దూ అదుపు లేదని… నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని.. ఆగస్టు 28న కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ జీవో ఇచ్చారని తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని…
శ్రీకాకుళం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను పూర్తిచేసి హనుమంతు అప్పయ్యదొర పేరు పెడతామని వెల్లడించారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని…..మనం చేసే పనులే శాశ్వతమని స్పష్టం చేశారు. అప్పయ్య దొర ఆశయాలను కొనసాగిస్తామని… వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే అప్పయ్యదొరే గుర్తుకు వచ్చారన్నారు. వకీల్ సాబ్ సినిమాను అప్పయ్య దొరకు అంకితం చేయొచ్చని తెలిపారు. సినిమాలో పవన్ క్యారెక్టర్ మాదిరిగానే అప్పయ్య దొరలో ఆ…
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్‌లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి…