శ్రీకాకుళం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను పూర్తిచేసి హనుమంతు అప్పయ్యదొర పేరు పెడతామని వెల్లడించారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని…..మనం చేసే పనులే శాశ్వతమని స్పష్టం చేశారు. అప్పయ్య దొర ఆశయాలను కొనసాగిస్తామని… వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే అప్పయ్యదొరే గుర్తుకు వచ్చారన్నారు. వకీల్ సాబ్ సినిమాను అప్పయ్య దొరకు అంకితం చేయొచ్చని తెలిపారు. సినిమాలో పవన్ క్యారెక్టర్ మాదిరిగానే అప్పయ్య దొరలో ఆ తరహా పోరాటాన్ని తాను స్వయంగా చూశానని వివరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.