Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
వైసీపీని శాశ్వతంగా సమాధి చేస్తేనే భవిష్యత్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కనిగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నదుల అనుసంధానం చేసి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని.. కానీ, పక్క రాష్ట్రంతో గొడవపడి హక్కులన్ని కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. కాల్వలు తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి… -
బాబు ‘డబుల్’ గేమ్ వర్కౌట్ అయ్యేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది.… -
ప్రధాని మోడీకి ఏపీ సీఎం లేఖ.. వెంటనే జోక్యం చేసుకోండి..!
విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది… ఈ తరునంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యుత్ సంక్షోభంపై వెంటనే జోక్యం చేసుకోవాలి లేఖలో విజ్ఞప్తి చేశారు.. యూరోప్, చైనాల్లో ఉన్న విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత దేశాన్నీ తాకిందని లేఖలో పేర్కొన్న సీఎం.. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు… -
హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదలు.. రూ.200 కోట్ల క్యాష్ సీజ్..!
హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ… -
ఏపీ కరోనా అప్డేట్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,235 శాంపిల్స్ పరీక్షించగా.. 693 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 927 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,86,60,811 కు… -
ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి.. నారాయణ డిమాండ్
మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇక, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన వారిపైన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.. రోజుకి వెయ్యికోట్లు సంపాదించడానికి ఆదానీ ఏమైనా మాయల పకీరా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోవాలన్నారు. మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ దందా జరుగుతోందని… -
అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. కీలక వ్యాఖ్యలు
అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలని.. దీని వల్ల రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల విషయంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని పేర్కొన్న సీఎం… -
ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది.. ప్రభుత్వంపై పవన్ ఫైర్
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వకపోతే ఎలా..? అని నిలదీసిన ఆయన.. వృద్ధాప్యంలో వారి వైద్య ఖర్చులకీ ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే దీనికి కారణంగా తెలిపారు పవన్ కల్యాణ్… మరోవైపు.. పోలీసుశాఖలో… -
దేవాదాయ శాఖ కమిషనర్ గా హరి జవహర్ లాల్…
దేవాదాయ శాఖ కమిషనరుగా బాధ్యతలు స్వీకరించారు హరి జవహర్ లాల్. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలపై ఉద్యోగులతో జవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. అందులో హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో కైంకర్యాలు, పూజలు సంప్రదాయ బద్దంగా జరిగేలా చూస్తాం. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించే అంశంపై దృష్టి పెడతాం. ఆధ్యాత్మిక వాతావరణం ఆలయాల వద్ద కనిపించాలి. హిందూ సంప్రదాయాలను గౌరవించేలా, ఆచరించేలా ప్రోత్సహిస్తాం.… -
కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..!
డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? రాజకీయ లబ్ధికోసం గుడ్డిగా ఏదేదో మాట్లాడి ఓ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందా..? కాకినాడ ఎపిసోడ్ తర్వాత టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలేంటి.. రుసరుసలేంటి..? కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..! ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడిన అంశాన్ని అధికార వైసీపీకి చుట్టేస్తూ.. టీడీపీ పెద్దఎత్తున ప్రెస్మీట్ల పోరాటం చేస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేంత వరకు టీడీపీలో చంద్రబాబు…
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..