ఏపీలో చవితి రాజకీయం : నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం తీవ్ర రూపు దాల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సత్యకుమార్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.నేడు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు.. వేడుకలకు ససేమిరా అంటున్నారు అధికారులు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను..బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఈ నిర్ణయంపై పునారాలోచన చెయ్యాలని సీఎంకు లేఖ కూడా రాశారు. ఎన్నికలు, సీఎం సభలు, వైసీపీ మీటింగ్‌లకు లేని కరోనా వైరస్ ప్రభావం.. గణనాథుని ఉత్సవాలకే అడ్డొస్తుందా అని ప్రశ్నించారు. కర్నూలు రాజ్ విహార్ సెంటర్‌లో భారీ నిరసనలో భాగంగా సోమువీర్రాజు, సత్యకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక చవితి సందర్భంగా పందిళ్లు వేసుకుని ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సర్కార్ నిర్ణయానికి నిరసనగా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగనున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి, మెమొరాండం ఇవ్వనున్నారు. సర్కార్ నిర్ణయం మారకుంటే, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!