గణేశుడికే ‘విఘ్నం’.. ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఫైట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఈసారి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అందరూ భావిస్తున్నారు. మరో ఐదురోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ఏపీలో కాకరేపుతున్నాయి.
కరోనా నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. మండపాలకు, ఊరేగింపులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. నిమజ్జనాలు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులపై బీజేపీ నేతలు గరంగరం అవుతున్నారు. ఏ పండుగలకు లేని ఆంక్షలు వినాయక ఉత్సవాలకే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గుడ్ ఫ్రైడ్, మొహర్రం పండుగలు నిర్వహించారని గుర్తు చేశారు. దీనికితోడు ఇటీవల థియేటర్లు, పాఠశాలలను తెరిచారని, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వాటిన్నింటికి వర్తించని కరోనా నిబంధనలు కేవలం హిందూ పండుగలకే ఎందుకు వర్తింపజేస్తారంటూ జగన్ సర్కారును బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కరోనా టైంలో తమకు కూడా ప్రజారోగ్యం ముఖ్యమేనని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పండుగ నిర్వహించుకునేలా ప్రభుత్వం ఆదేశాలని ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
అయితే వైసీపీ మాత్రం అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై ఇలాంటి నిబంధనలు విధించామని చెబుతోంది. గణేష్ ఉత్సవాల్లో జనాలు గుమ్మిగూడే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రజలంతా కరోనా నిబంధనలకు అలవాటుపడిన క్రమంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తే ఏమవుతుందని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించడం కరెక్టేనని అంటున్నారు. ఏదిఏమైనా గణేష్ ఉత్సవాలను కేంద్రంగా చేసుకొని ఏపీలో బీజేపీ వర్సెస్ వైఎస్సాఆర్సీపీ మధ్య వేడి రాజుకుంది. ఈ పండుగ వార్ లో మున్ముందు ఎవరూ పైచేయి సాధిస్తారో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!