కలకలం సృష్టించిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్‌లా ముగిసింది… అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి గత నెలలో సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. దీంతో బుచ్చయ్య చౌదరితో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరిపింది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాతో భేటీ అయ్యారు బుచ్చయ్య చౌదరి.. దీంతో.. బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారానికి పులిస్టాప్ పడిపోయింది.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. వైసీపీ…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. ఇక, నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు.. అయితే, మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు.. వేగంగా పనులు పూర్తిచేసే పనిలో పడిపోయారు.. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడకదారి భక్తులు వెళ్తుండగా.. టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. అక్టోబర్ 1వ తేదీ నుంచి అలిపిరి నడకమార్గంలో…
పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో…
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్ ఫ్రంట్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై బెంగళూరులో అఘాయిత్యం జరిగింది… బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన యువతి.. బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ తో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఫోన్లు మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తాజాగా ఇద్దరం ఓసారి కలుద్దామని నిర్ణయానికి వచ్చారు.. ఇదే క్రమంలో ఆగస్టు 31వ తేదీన…
కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గక ముందే.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని.. తిరిగి స్కూళ్లు, విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం… అయితే, అక్కడక్కడ వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి.. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ జూనియర్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.. కోవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం.. సోమవారం వరకు కాలేజీకి సెలవు ప్రకటించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 25,829 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,821 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిన్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కొన్ని…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ను…
ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట. దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా? కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన…