ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించారు.. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో.. దీంతో.. కొత్త సీఎస్‌గా సమీర్ శర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈనెల 30న ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయనుండగా.. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు సమీర్ శర్మ.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు.…
దొంగతనం చేసిన వారిని పట్టుకునే పోలీసులే దొంగతనం చేశారు. అవును మీరు వింటున్నది నిజమే. చిత్తూరు జిల్లాలో పోలీసులు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఓ ఏఎస్ఐ చేతివాటం చూపించాడు.. అదీ రోడ్డుపక్కనన ఉన్న ఓ చిన్న దుకాణంలో. రాత్రిళ్లు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాపులోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు.. ఆ దృశ్యాలు సీసీ కె మెరాలో రికార్డు అయ్యాయి. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి…
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో.. శ్రీకాకుళం జిల్లాలోని మాణిక్యపట్నం గ్రామంలో తరచుగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులు.. అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు.. ఆంధ్రాలోనే ఉంటామని చెబుతున్నా.. మాణిక్యపట్నంపై ఒడిశా అధికారులు పట్టు పెంచుకోవాలని చూడడం.. అది తమ రాష్ర పరిధిలోని గ్రామమే అని వాదిస్తుండడం.. పదే పదే ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. స్థానికులకు ఈ పరిణామం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఈ మధ్య.. అతి చొరవ తీసుకుని మాణిక్యపట్నం గ్రామ తహసీల్దార్ కార్యాలయానికి సీల్ వేసి..…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్థికంగా కుదురుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. అప్పులపై ఆధారపడుతూ అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు.. మరో ఉతం అందింది. వచ్చింది చిన్నదైనా.. కనీసం నెలో.. రెండు నెలలో మెయింటైన్ చేయగలిగేలా.. ఆర్థిక వనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయలను అప్పు రూపంలో జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. తాజాగా.. కేంద్రం ఏపీకి 1438 కోట్ల రూపాయలను అందించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసే…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను కలవరానికి గురిచేశాయి.. అయితే, ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా కొనసాగనుంది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశమున్నందున నేటి నుంచి 17వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా. ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్ వివేకా కేసులో ఇవాళ ఉదయం నుంచి ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు… దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు.…
క్యాంప్ కార్యాలయంలో సీఎం ఐఎస్ జగన్‌ను కలిశారు రమ్య కుటుంబ సభ్యులు.. జరిగిన ఘటనపై సీఎం జగన్‌ను వివరించారు రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం, ధైర్యాన్ని చెప్పారు.. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు.. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎంతో…
17 రాష్ట్రలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.. “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” (పీడీఆర్డీ) గ్రాంట్ కింద ఆరో విడత నిధులు విడుదల చేసింది.. దేశంలోని 17 రాష్ట్రాలకు 6వ విడత కింద రూ. 9,871 కోట్లు విడుదలయ్యాయి.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అర్హత కలిగిన రాష్ట్రాలకు “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” గ్రాంట్ కింద రూ.…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో…
రెండున్నరేళ్ల పాలనలో వైఎస్ జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు… శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్టేషన్ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ విడుదలయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సీఎం జగన్ ప్యాలెస్ దాటి బయటకు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.. తక్షణమే నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు.. ఇక, రెండున్నరేళ్ల పాలనలో జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో…