Nara Lokesh: అందరికీ పార్టీనే సుప్రీం.. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని మంత్రి నారా లోకేష్ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగుపడింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేలా జోనల్ కోఆర్డినేటర్లు చొరవ చూపాలి అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో జోనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షించాలి. ఏమైనా లోటు పాట్లు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్ లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలి.. మిగిలిన సంస్థాగత కమిటీల నియామకం కూడా పూర్తి చేయాలని నారా లోకేష్ ఆదేశించారు.
Read Also: Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేస్.. సోనమ్ రఘువంశీకి బెయిల్ తిరస్కరణ..
ఇక, నియోజకవర్గాల్లో జరిగే గ్రీవెన్స్ లలో సమస్యలు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయని మంత్రి లోకేష్ అడిగారు. కోఆర్డినేటర్లు దీనికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని సూచించారు. డీడీఆర్సీ సమావేశం జరిగే రోజే ఇంఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుపుకోవాలని తెలిపారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం గురించి ఇంఛార్జి మంత్రితో కలిపి కోఆర్డినేటర్లు చర్చించాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న పార్టీ కమిటీలపై దృష్టి పెట్టాలి.. మిగిలిన నామినేటెడ్ పదవులకు అర్హులైన అభ్యర్థుల జాబితాను రెడీ చేయాలి.. గత ప్రభుత్వ హయాంలో అకారణంగా మన కార్యకర్తలపై నాయకులపై కేసులు పెట్టారు.. ఆ కేసులను చట్టపరంగా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని లోకేష్ సూచించారు.