ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. టెస్ట్కు 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారని.. వారిలో 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు మంత్రి.. ఇక, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,54,997 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 56,635 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 170. 6640 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్…
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. ఇవాళ్టి నుంచి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… ఇవాళ్టి నుంచి అలిపిరి వద్ద రోజు కి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ…
కేంద్రం బాటలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్ మెంట్ కోసం అప్పగించింది ప్రభుత్వం. దీని కోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను రుద్రాభిషేక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు అప్పగించింది. మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించిన స్టేట్ గెస్ట్ హౌస్ ను లక్ష చదరపు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పరస్పరం ఫిర్యాదులు, లేఖల పర్వం కొనసాగగా.. గతంలో తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని ఇటీవల కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అనుమతి లేకుండా…
ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మరోమారు భూవివాదం చర్చనీయాంశంగా మారింది. మందస (మం) సాబకోట పంచాయతీలోని మాణిక్యపట్నంలో ఒడిశా అధికారుల ఓవరాక్షన్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసారు. అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి భర్త సవర గురునాథంను అరెస్ట్ చేసారు ఒడిశా పోలీసులు. పంచాయతీ ఎన్నికల తర్వాత మరోమారు తెరపైకి మాణిక్యపట్నం భూవివాదం వచ్చింది. ఈ వివాదం నేపధ్యంలో మాణిక్యపట్నాన్ని సందర్శించారు మందస తహశీల్దార్, ఎంపిడీఓ, డీఎస్పీ శివరామిరెడ్డి. ఇక…
అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకవర్గం.. అధికారుల మధ్య నిత్యం పోరాటాలు.. కుమ్ములాటలు. అక్రమాలకు అంతే లేకుండా పోయింది. కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నా సొంత లాభానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. వారెవరో.. ఆ ఆలయం ఏదో ఈ స్టోరీలో చూద్దాం. ఆలయానికి ఆదాయం పోతున్నా పట్టదు! తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో.. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు స్వార్థపరులు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. కేవలం షాపుల నుంచే 3…
ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హస్తిన బాట పట్టారు.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈలోపే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. అటూ రాజకీయాల్లో, ఇటూ సినిమాల్లోనూ బీజీగా కొనసాగుతున్నారు. రాజకీయాలు పవన్ కల్యాణ్ కు కొత్తమే కాదు. ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు పవన్ లో రాజకీయ నాయకుడు పుట్టారు. నాడు ఆ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లిన సంగతి అందరికీ తెల్సిందే. 2014లో పవన్ కల్యాణ్ పార్టీనైతే…
టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని…