216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. క్యాంప్ కార్యాలయంలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్నారు.. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందని తెలిపిన ఆయన.. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందని.. మొదటి త్రైమాసికంలో ఏకంగా 24.43 శాతం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,856 శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, గడిచిన 24 గంటల్లో…
పండుగల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓనమ్ పండుగ తర్వాతే కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభించాయని గుర్తుచేశారు… కరోనా నిబంధనలు పాటించాలని అలాంటి పరిస్థితి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పలుచోట్ల కోవిడ్ పాజిటివిటీ రేటు 13శాతం ఉందని గుర్తుచేసిన మంత్రి.. వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనేది…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… రాష్ట్రంలో మటన్ మార్ట్ ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది… ఆరోగ్యకరమైన మాంసం వినియోగం పెంచటమే లక్ష్యంగా మార్ట్ లు ఏర్పాటు చేయనుంది.. తొలి దశలో విశాఖ, విజయవాడల్లో నాలుగు చొప్పున ఈ మార్ట్లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఏపీ సర్కార్.. ఆ తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. రూ.11.20 కోట్లతో 112 మార్ట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.. పరిశుభ్రమైన వాతావరణంలో రిటైల్…
ఏపీలో విద్యాకానుక లబ్ధిదారులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ షూతో పాటు స్పోర్ట్స్ డ్రస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సూచించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం… ఫౌండేషన్ స్కూళ్ళ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నాడు-నేడుపై సమీక్ష జరిపిన సీఎం జగన్… రెండో విడతలో 12 వేలకు పైగా స్కూళ్లలో పనులు…
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.. ప్రతిపక్షాల నేతలే కుండా హిందూ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.. కొన్ని ప్రాంతాల్లో నిరసన, మౌన దీక్షలు సైతం చేపట్టారు. అయితే, వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.. వినాయక చవితి ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.…
రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ…
తరచూ వివాదాల్లో చిక్కుకోవడం.. ఆనక పార్టీ పెద్దలతో తలంటించుకోవడం.. ఆ మంత్రికి కామనైపోయిందా? అప్పట్లో పేకాట.. బెంజ్ కారు.. ఇప్పుడు SIని బెదిరిస్తున్న వీడియో…! మళ్లీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ? ఈ స్థాయిలో వరస వివాదాల్లో చిక్కుకున్న మరో మంత్రి లేరా? గుమ్మనూరు జయరామ్. ఏపీ కార్మిక శాఖ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరామ్.. మంత్రి అయ్యాక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.…
మూడేళ్ల క్రితం వరకు ఆ జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కకావికలం. నాడు కీ రోల్ పోషించిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అధినేత ఆదేశాలతో ఫీల్డ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ నలుగురు పోరాటాలకు సిద్ధమయ్యారని టాక్. ఇంతకీ ఎవరా నాయకులు? స్వయంకృతాపరాధంతో హారతి కర్పూరమైన టీడీపీ ప్రతిష్ట! గుంటూరు జిల్లాను గతంలో తమ అడ్డాగా చెప్పుకొన్న టీడీపీ.. వైసీపీ గాలిలో ఆ అడ్రస్‌ను గల్లంతు చేసుకుంది.…
సంక్షేమ పథకాల అమలుకు పెరుగుతున్న భారం.. వీటికి తోడు జీతాలు, పెన్షన్లు ఇతర కార్యక్రమాలకు భారీ స్థాయిలో వెచ్చించాల్సి రావడం.. వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాస్త ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు.. ఆ శాఖ ఉన్నతాధికారులు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను సైతం బుగ్గన కలిశారు. సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. జనం తిరిగి డబ్బులు…