తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది.. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ప్రైవేటుపరం కానున్న మొత్తం 13 విమానాశ్రయాల్లో చిన్నవి ఏడింటినీ మిగిలిన ఆరు పెద్ద విమానాశ్రయాలతో విలీనం చేయనున్నారు. తిరుచ్చి విమానాశ్రయ పరిధిలోకి తిరుపతి విమానాశ్రయం రానుంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోంది. విశాఖపట్నం, విజయవాడ తర్వాత ఏపీలో అత్యధిక…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,28,795కి చేరింది. ఇందులో 19,99,651 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 15,157 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1090 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనాతో 17 మంది మృతి చెందినట్లు…
తెలుగు దేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న నిరసనలపై ఘాటు విమర్శలు చేశారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగితే కేంద్రాన్ని అడగండి… ఇంట్లో జోడీగానే ఉన్నారుగా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కేంద్రాన్ని వదిలేసి… మా పై ఏడుస్తారెందుకు? అని ప్రశ్నించారు. 1,261 హామీలిచ్చి నెరవేర్చని మీదా దేవతల…
తిరుపతి వైసీపీలో రుసరుసలు..! ఎమ్మెల్యే భూమన.. మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య గ్యాప్ వచ్చిందా? పాలిటిక్స్‌లో పెత్తనాలకు కాలం చెల్లిందని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యేతో వారికి చెడింది? తిరుపతిలో భూమన వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు! గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో ఆశించిన మెజారిటీ రాకపోయినా.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా పట్టుసాధించింది అధికారపార్టీ. 48 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలవగా.. టీడీపీకి ఒక్క డివిజనే దక్కింది. కార్పొరేషన్ పరిధిలో పూర్తి గ్రిప్ దక్కిందన్న…
సంచలన వ్యాఖ్యలకు, ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా మాట్లాడడంలో జేసీ బ్రదర్స్‌కు పెట్టింది పేరు.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా అదే కోవలోకి వస్తారు.. ఇవాళ జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సీమలో ప్రాజెక్టులకంటే ముందు కార్యకర్తలను కాపాడండి అని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తల సమావేశం పెట్టండి.. ఇవాళ జరిగే సమావేశానికి అందరికీ ఆహ్వానం లేదన్నారు.. ఒకరిద్దరు నేతల…
ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది.…
ఎంత బలం ఉన్నా.. ఎంతటి బలగం ఉన్నా.. ఉపాయాలు, వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఓ వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే.. ఎన్నో డక్కాముక్కీలు తినాల్సి ఉంటుంది. రాటుదేలాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రజా పోరాటాల్లో అరెస్టూ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. విషయం ఏదైనా సరే.. ఆయన జనాల్లోకి వెళ్తున్న తీరు చూసి.. పార్టీ అభిమానులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో.. పోలవరం నిర్వాసితులను…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ భారీగా పెరింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 67,911 శాంపిల్స్ పరీక్షించగా.. 1,608 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,107 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి…