అన్ని రాష్ట్రాల మాదిరిగానే కరోనా ఎంట్రీ తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా కుప్పకూలింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందే ఏపీ అప్పుల్లో కురుకుపోయింది. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరిట చేసిన అప్పులు వేలకోట్లలో ఉన్నాయి. ఈ భారం మొత్తాన్ని కూడా జగన్ సర్కారే మోయాల్సి వస్తోంది. వీటి వడ్డీల భారమే ప్రతినెలా తడిచిమోపడు అవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఏపీ…
పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల చేసారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి. సెప్టెంబర్ 1న పరీక్ష నిర్వహణ జరిగిన ఈ పరీక్షకు 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా 64వేల మంది అర్హత సాధించారు. అంటే 100 శాతానికి 94.21% అర్హత సాధించారు. ఈ పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది శ్రీకాకుళం జిల్లా. అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం ఉంది నెల్లూరు జిల్లాలో కాగా అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లాలో ఉంది…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నేతృత్వంలోనే జరగాలనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించబోతున్నారు. దానికి ఉదాహరణంగా నిన్న రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశాన్ని పేర్కొవచ్చు. ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే, సినిమా పరిశ్రమ కోరుకున్నదే జగన్ చేయబోతున్నారన్న భావన ఎవరికైనా కలుగుతుంది.…
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. యువతి పై విచక్షణా రహితంగా చేత్తో, కర్రతో దాడి చేసాడు. కొట్టవద్దు అని బ్రతిమిలాడుతున్న కనికరించలేదు ఆ వ్యక్తి. నేను చెప్పినట్లు వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. గుట్టలు విప్పు కోడాను.. అందరూ ముందు అంటూ రెచ్చిపోయాడు యువకుడు. నా వల్ల కాదు అని బ్రతిమిలాడుతున్న కనికరించలేదు అతను. దాదాపు 10 దెబ్బలు కర్రతో, చేత్తో 4 దెబ్బలు కొడుతూ వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి. చేతి గాజులు…
ఏపీలో టీడీపీ సీనియర్ల కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయా? వారి వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయా? రచ్చరచ్చ అవుతోందా? నేతల స్టేట్మెంట్స్ తెలుగుదేశాన్ని మరోసారి గందరగోళంలో పడేస్తున్నాయా? సీనియర్ల ప్రకటనల వెనక ఉన్న మర్మం ఏంటి? టీడీపీలో సీనియర్లు ఎందుకు తిరగబడుతున్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి గోడ దూకేయాలని అనుకున్నవారు దూకేశారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు సైలెంట్ అయ్యారు. ఒకరో ఇద్దరో మాట్లాడినా.. కేసులకు భయపడి దూకుడు తగ్గించేశారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది.…
బీజేపీ అంటే ఉత్తరాది పార్టీగా ముద్రపడింది. అందుకు తగ్గట్టుగానే ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఉత్తరాది బలంతోనే ఆపార్టీ దేశంలో అధికారంలోకి వస్తోంది. ఇటీవల వరుసగా రెండుసార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దక్షిణాదిన బీజేపీ పాగా వేయలేక పోతుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక కర్ణాటక మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఆపార్టీకి ఏమాత్రం బలం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే…
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు అధికారులు… విచారణకు హాజరుకావాలంటూ ముగ్గురు నిందితులకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ సలహాదారుగా ఉన్న వేమూరి హరి ప్రసాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా చేసిన సాంబశివరావుతో పాటు.. టెండరు దక్కించుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ముగ్గురిలో హరిప్రసాద్, సాంబశివరావు విచారణకు హాజరు అయ్యారు. సత్యనారాయణ పురంలోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రెండు గంటల పాటు నిందితులను…
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మర్డర్ కేసులో కీలక నిందితుడైన మావోయిస్టు కమాండర్‌ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్తరాసిచెట్లకు చెట్లకు చెందిన దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను అరెస్ట్ చేశారు ఒడిశా పోలీసులు. రెండు రోజుల కిందట పేటగూడ, నౌరా గ్రామాల అటవీ ప్రాంతంలో DVF, NOG, BSF సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రమేశ్ పట్టుబడ్డాడు. సోమవారం ఉదయం నిర్వహించిన కార్డాన్ సెర్చ్‌లో.. హార్డ్‌కోర్ మావోయిస్ట్ దుబాసి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రి లో చేరారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి లో చేరారు మంత్రి బొత్స సత్య నారాయణ. అయితే… మంత్రి బొత్స సత్యనారాయణ…. ఎందుకు ఆస్పత్రి లో చేరారనే దాని పై ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆయన కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది. గత రెండు రోజుల నుంచి మంత్రి బొత్స… కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని… ఈ…
హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై సమీక్ష చేశారు.. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌పై ఆరా తీశారు.. ఈ సమావేశంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఏయే జిల్లాల్లో ఏ…