ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లతో సహా సినిమా థియేటర్స్ కోసం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే ఈ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని, పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి…
అమరావతి : నూతన టీటీడీ పాలక మండలి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ టీటీడీ పాలక మండలి పై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఈ సారి ఏకంగా 25 మంది రెగ్యులర్ సభ్యులతో పాలక మండలి ఏర్పాటు కానుంది. ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి, భూమన, మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కొనసాగనున్నారు. అలాగే… ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది ఈ టీటీడీ పాలక మండలి లో ఉండనున్నారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. అయినా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తరుచూ ఇరు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జలవివాదాలు, సరిహద్దు వివాదాలు, నిధుల వాటా విషయాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య కరెంట్ ఫైట్ నడుస్తుండటం చర్చనీయాశంగా మారింది. తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని తాజాగా…
ఈరోజు అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హజరు అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. ఆ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ… స్పీకరుపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ నన్ను విచారణకు పిలిచారు. వ్యక్తిగత కారణాల వల్ల గతంలో రాలేకపోయాను. నేను స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ప్రెస్ నోట్ పేర్కొన్న అంశాలపై ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన అంశంపై వివరణ ఇచ్చాను అని తెలిపారు. ఎలాంటి బేషజాలు లేకుండా విచారం వ్యక్తం…
అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటర్నల్ పాలిటిక్స్ దెబ్బతీశాయి. పార్టీ అధికారంలోకి రావడంతో బలపడేందుకు ఛాన్స్ దక్కిందని సంబర పడ్డారు. కానీ సీన్ రివర్స్. నిత్యం ఏదో ఒక అంశంపై లడాయి. లోకల్‌గా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టడానికంటే.. సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువైయ్యాయట. ఆ నియోజకవర్గం ఏంటో..అక్కడ గొడవలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇచ్ఛాపురం వైసీపీలో నిత్యం ఏదో ఒక తగువు! శ్రీకాకుళం జిల్లా వైసీపీలో గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు ఇచ్ఛాపురం. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. 2019లో…
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కు మొత్తంగా 2, 59, 688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 83,820. అందులో పరీక్షలకు 78,066 మంది హాజరుకాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో మొత్తం 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారు. ఇక రేపటి నుంచి…
న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ.. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.. ఈ ఛార్జిషీట్లో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, ఆదర్శ రెడ్డి, లవునిరు సాంబశివారెడ్డిలపై అభియోగాలు మోపింది.. ఇక, ఈ కేసులో మరో 16 మంది పేర్లను ఛార్జిషీట్లో పొందుపర్చింది సీబీఐ.. కాగా, ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. దీనికి ప్రధానం కారణం టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గించడంగా చెప్పుకోవచ్చు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్ పరీక్షించగా.. 864 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు.…
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని..…