తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది.. కొత్త సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.. అయితే, సాంకేతికంగా టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 80కి చేరుకుంది.. టీటీడీ ఛైర్మన్‌తో పాటు 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్అఫిషియో సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80కి చేరుకుంది టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య.. టీటీడీ కొత్త పాలకమండలి పేర్లు…
చంద్రబాబు, లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెన్షన్ల విషయంలో ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నాం.. సుమారు 3 లక్షల పెన్షన్లని వెరిఫికేషన్ కోసం పెట్టారని.. 3 లక్షల పెన్షన్లను తొలగించినట్టు కాదు.. ప్రస్తుతం జరిగేది పరిశీలన మాత్రమే అని.. ఇందులో కూడా అర్హులైన వారికి పెన్షన్ అందుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక, కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణా బేసిన్లో జల జగడం తారాస్థాయికి చేరుకోగా.. గోదావరి బేసిన్లోనూ పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.. దీంతో.. ఇరు రాష్ట్రాల మధ్య జలజగడానికి ముగింపు పలుకుతామంటూ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.. ఇది, కొన్ని కొత్త సమస్యలకు కూడా కారణమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 17వ తేదీన గోదావరి నదీ యాజమాన్య…
అమరావతి : డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఐదేళ్లు.. అంతకు మించి ఒకే చోట పని చేసిన వారికి తప్పని సరిగా బదిలీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.…
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. కొత్తగా 1445 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 11 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 1,243 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2, 74, 75, 461…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన పొలిటికల్ కామెంట్లు చేయడం ఏంటి? విమర్శలు చేయడం ఎందుకు? స్పీకర్‌గా ఉండి ఇలా చేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, తనను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. స్పీకర్ మాట్లాడటమేంటి అంటున్నారు.. ప్రజలు ఓటేసి నన్ను గెలిపించారు.. వారి కోసం మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెప్పడం కూడా…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి జాబితాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేశారు.. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మేల్యేలు కాటసాని, గోర్ల బాబు రావు, మధుసూదన్ యాదవ్‌కు చోటు దక్కగా.. తెలంగాణ నుంచి రామేశ్వరావు, లక్ష్మీ నారాయణ, పార్థసారధిరెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్‌కు అవకాశం…
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి.. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయం లో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రశంసించిన సుబ్రహ్మణ్యం…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్ర ప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ తీర్పు వెలువరించింది… సీఎం జగన్‌కు, ఎంపీ సాయిరెడ్డికి భారీ ఊరట కలిగిస్తూ.. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.. కాగా, సీఎం జగన్, ఎంపీ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..సీఎం హోదాలో వైఎస్…