ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రి లో చేరారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి లో చేరారు మంత్రి బొత్స సత్య నారాయణ. అయితే… మంత్రి బొత్స సత్యనారాయణ…. ఎందుకు ఆస్పత్రి లో చేరారనే దాని పై ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆయన కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది.
గత రెండు రోజుల నుంచి మంత్రి బొత్స… కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని… ఈ నేపథ్యం లోనే ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు.. సమాచారం అందుతోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయన అపోలో ఆస్పత్రి లో చేరినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.