సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది బుల్లెట్ బండి సాంగ్.. ఇప్పుడు ఏ పెళ్లి జరిగినా.. ఆ ఫంక్షన్ అయినా.. బుల్లెట్ బండి సాంగ్ ఉండాల్సిందే.. అంతే కాదు.. ఎక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది.. ఆస్పత్రిలో ఈ పాటకు నర్సు డ్యాన్స్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురైంది.. అక్కడక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ పాటకు కాలు కదిపారు.. ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.. తాగాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి.. డుగ్గు డుగ్గు…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశమైంది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తీసుకున్న నిర్ణయాలను విరించారు.. పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. రైతులకు ఉదయం 9 గంటల పాటు ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కు 30 ఏళ్ల పాటు ఇచ్చేందుకు కేంద్ర…
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దాసరి కిరణ్.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 61,178 శాంపిల్స్ పరీక్షించగా… 1,367 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 14 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,248 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరగా.. 20,06,034 మంది…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు సీఎం.. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక, పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్న ఏపీ సీఎం.. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.. ధనికులను కూడా పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చిన గత టీడీపీ ప్రభుత్వానిదని.. అర్హులకు…
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మతాలపై హాట్ కామెంట్స్ చేశారు… అన్ని మతాలను ఒకే విధానంతో చూడాలని ప్రభుత్వాన్నికి సూచించిన ఆయన.. కొన్ని మతాలకు సంబంధించిన విషయాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం జరుగుతోందని ఆరోపించారు.. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న ఆయన.. ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో 15 మంది ఉండే సభ్యులను ఎక్కువ చేశారు తప్పితే.. కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు.. మరోవైపు.. అవినీతిపరులను ఇవాళ హిందూ ధార్మిక సంస్థల్లో వేయడాన్ని…
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించిన తరువాత కౌంటింగ్ ను నిలిపివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంజ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు తీర్పును ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కోట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్ఈసీ కౌంటింగ్‌కు సంబందించిన తేదీని ప్రకటించాల్సి ఉన్నది.…
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కెబినెట్ భేటీ జరగనుంది. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై కెబినెట్లో ప్రతిపాదనలు పెట్టనున్నారు. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చించనుంది రాష్ట్ర మంత్రి వర్గం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో…
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.. 40 అంశాల అజెండాతో జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్న మంత్రి వర్గం.. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు చేయనుంది.. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చజరగనుండగా.. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ…
టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న మహిళ సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి…చేతులెత్తేసిందన్నారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేసిందని ఆరోపించారాయన. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపెడయ్యాయని, 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడితో భారం పోయేదన్నారు జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామన్నారు.…