ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు హీట్ పెంచాయి… ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. సీఎం వైఎస్ జగన్.. మంత్రులు, డీజీపీ.. ఇలా.. అందరినీ వరుసపెట్టి కామెంట్ల్ చేశారు.. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. ఇవాళ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ముట్టడికి కూడా వెళ్లారు.. అయితే, తన కామెంట్లపై మరోసారి స్పందించిన అయ్యన్నపాత్రుడు.. నేను మాట్లాడింది చూడండి.. ఎక్కడైనా తప్పు మాట్లాడానా? అని ప్రశ్నిస్తూనే.. మళ్లీ అందరినీ టార్గెట్ చేశారు.. పిచ్చి పరిపాలన చేసేవాడిని పిచ్చి తుగ్లక్ అని కాకుండా ఏమంటారు..? రైతుల సమస్యలపై మాట్లాడితే దౌర్జన్యం చేస్తారా..? అంటూ మండిపడ్డారు.
జగన్‌పై అభిమానం ఉంటే ఆయనకు సేవ చేసుకోండి.. కానీ, శవాలపై చిల్లర పైసలు ఏరుకునే జోగి రమేష్.. చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు అయ్యన్న.. నేను మాట్లాడింది చూడండి.. ఎక్కడైనా తప్పు మాట్లాడానా.. ? అని ప్రశ్నించిన ఆయన.. చెత్తపై పన్ను వేసినవారిని చెత్త పాలన అంటే తప్పా..? నిరంతరం బూతులు మాట్లాడే మంత్రిని బూతుల మంత్రి అనడం తప్పా..? అంటూ మళ్లీ తన కామెంట్లను రిపీట్ చేశారు.. ఇక, దాడి చేస్తామని నిన్నే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా.. చంద్రబాబు ఇంటి దగ్గర ఎందుకు భద్రత కల్పించలేదు.. అని నిలదీసిన అయ్యన్నపాత్రుడు.. చంద్రబాబును హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబును ఉరితీయాలన్న జగన్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన.. బూతుల మంత్రి కొడాలి నాని ఎన్నిసర్లు, ఎన్ని విధులుగా.. చంద్రబాబుని ఎన్ని అన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అని మండిపడ్డారు.. నన్ను అరెస్టు చేసినా సిద్ధమే నని ప్రకటించిన అయ్యన్నపాత్రుడు.. నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం చేసేది మీ అధికారపార్టీవారేనని ఆరోపించారు.. నేను ప్రభుత్వ విధానాలపై మాట్లాడాను తప్పా.. వ్యక్తిగతంగా మాట్లడలేదన్న ఆయన.. సీఎం జగన్‌కు దమ్ముంటే డీజీపీని పిలిచి వార్నింగ్ ఇవ్వాలని సూచించారు.. పాదయాత్రలో మీకు ఎంత భద్రత కల్పించామో గుర్తు చేసుకోండి.. అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు.