గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది గతంలో ఎన్నడూ రీతిలో కేవలం 23సీట్లకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. ఇదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు యాక్టివ్ గా పని చేసిన దాఖలాల్లేవు. ఏదో మొక్కుబడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకానీ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో…
రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ అంశాలపై ఏపీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమయ్యారు. దీనికి కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. వర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలపై ప్రత్యేకంగా చర్చించారు మంత్రులు. విజయదశమికి చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది…
అనంతపురంజిల్లా విడపనకల్ గ్రామానికి చెందిన హిజ్రా అనుష్క @ హనుమప్పకు చెందిన ఇంటిలో 31.08.2021 వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువా మరియు గూట్లో దాచి ఉంచిన 6.5 తులాల బంగారు నగలు మరియు నగదు Rs.4,00,000/- లను దొంగలించుకెళ్లారు. ఈ కేసులో ఉరవకొండ C.I B. శేఖర్ నిందితుడిని అరెస్ట్ చేసి దొంగలించిన మొత్తము సొత్తు విలువ Rs.7,20,000/- లను రికవరీ చేశారు. ఇందుకు కృతజ్ఞతగా హిజ్రాల సంఘం ఉరవకొండ…
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ నామస్మరణే మార్మోగిపోతుంది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగాడు. మీడియా చేస్తున్న అతి, సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా థియేటర్ల ఇబ్బందులు, నిర్మాతలు, సినీ కార్మికుల కష్టాలను ఏకరువు పెట్టారు. కాగా పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలోని పెద్దలపై చేసిన…
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని మాజీ సైనికుల పెండింగ్ సమస్యలను ఆ లేఖ ద్వారా రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, సోము వీర్రాజు.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.. ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ను విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరారు.. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మాజీ సైనికుల వాహనాలకు…
సినీ దర్శకనిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని.. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు దుండగులు.. పోసాని ఇంటిపై రాళ్లువిసిరారు.. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన రాళ్ల దాడికి పూనుకున్నారు.. ఊహించన ఘటనతో వాచ్‌మన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు దురయ్యారు.. అయితే, ఘటనా జరిగిన సమయంలో పోసానిగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ…
బద్వేల్ బై ఎలక్షన్ పై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కాసేపట్లో బద్వేల్ ఉప ఎన్నిక కసరత్తు సమావేశం కానుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కడప జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ఎన్నికకు సంబంధించి నేతలకు బాధ్యతలు అప్పగించటం, అనుసరించాల్సిన వ్యూహాల పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ సమావేశం కోసం క్యాంపు కార్యాలయానికి బద్వేల్ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ, మంత్రి పెద్దిరెడ్డి,…
ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు.. ఎక్కడున్నా సరే స్వగ్రామానికి వెళ్లాలి, లేదంటా పెన్షన్ కట్ అవుతుంది అనే టెన్షన్ చాలా మంది వృద్ధులు, ఇతర పెన్షన్ దారుల్లో ఉంటుంది.. పెన్షన్ కోసం ఇతర ప్రాంతల నుంచి స్వగ్రామానికి వెళ్లివచ్చేవారు కూడా లేకపోలేదు.. ఇక, ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…
కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంవైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధను ప్రకటించింది. ఇక, బద్వేల్ ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, అభ్యర్థి సుధతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం…