ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 37,744 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 20,63,577 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,44,132 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా రాష్ట్రంలో 5,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also: వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా?
కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించినట్లు బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు మాత్రమే వెలుగు చూశాయి.