తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నటి రోజున పవన్ అధికారపార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జీవితంలో వైసీపీని ఓడించలేరని, ముందు పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో చూసుకోవాలని అన్నారు. అన్ని పార్టీలతో కలిసి రా చూసుకుందామని అన్నారు. వైసీపీ నేతలను పవన్ కళ్యాణ్ భయపెట్టేదేంటని ప్రశ్నించారు.…
బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు…
ఆ డిప్యూటీ సీఎంను రెండు నీటి ప్రాజెక్టులు తెగ ఇబ్బంది పెడుతున్నాయట. మంత్రి పదవి చేపట్టగానే వెంటనే పూర్తి చేస్తామని చిటికెలు కూడా వేశారట. చూస్తుండానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఎక్కడి గొంగళి అక్కడే. అమాత్యుల వారికి కూడా చికాకు మొదలైందట. ఇంతకీ ఎవరా మంత్రి? అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? కృష్ణాపురం, ఎన్టీఆర్ జలాశయాలను అభివృద్ధి చేస్తానని హామీ..! ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే. ఇక్కడ వరసగా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,054 శాంపిల్స్ పరీక్షించగా.. 1,010 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 13 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,149 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో…
అక్టోబర్ 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్ కు ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో జనసేప పార్టీ బద్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు సమాచారం. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన కారణంగా ఈసారి బద్వేల్ నియోజక వర్గంలో పోటీ చేసే అవకాశం జనసేనకు ఇచ్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, జనసేన నుంచి ఎవరు పోటీలో ఉంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్ అంతా ఒక సర్టిఫికెట్ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దుగ్గిరాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ రగడ..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నిక కోసం…
తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది.. యూబీఐలో తెలుగు అకాడమీ డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు హాంఫట్ అయినట్టు ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.. దీంతో.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీలో గోల్మాల్ అయిన నిధులు రూ.51 కోట్లకు చేరుకున్నాయి.. కార్వాన్, సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి ఈ…
బద్వేల్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అభ్యర్తి డాక్టర్ సుధ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపిన ఆయన.. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు.. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య…
ఈ రోజు తూర్పు గాలులలోని అవర్తనము ఆగ్నేయ బంగళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ ఉత్తర ఝార్ఖండ్ మరియు పరిసర బీహార్ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 7.6కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా ప్రదేశములలో, రేపు అనేక ప్రదేశములలో…