అమరావతి : సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని లేఖలో కోరారు నారా లోకేష్. ప్రతిపక్ష నేతగా జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో పర్యటించి కొన్ని హామీలిచ్చారని… ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని ఓసారి, రూ.10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారని తెలిపారు. భూమి లేని వారికి రూ.10 లక్షలు ప్యాకేజ్ ఇస్తానని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తామని జగన్…
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ను తెలుగు సినిమా నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్తో చర్చించారు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు.…
నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లను సాధించి ఘనవిజయం సాధించింది.. వైసీపీకి ఈ గెలుపు చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోగా.. ప్రతిపక్షాలకు మాత్రం పీడకలను మిగిల్చాయి. నాడు మొదలైన వైసీపీ వేవ్ నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. …
జనసేనాని వ్యూహం మారుస్తున్నారా? కొత్తగా పాత మిత్రుడి వైపు చూస్తున్నారా? రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహం మారుస్తానని పవన్ అనడం వెనక ఉద్దేశం.. బీజేపీని వీడటమా? టీడీపీతో జతకట్టడమా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతున్నా.. పవన్ అదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ఏపీ రాజకీయాలలో పొడుస్తున్న కొత్త పొత్తులకు సంకేతమేనా? అవసరమైతే వ్యూహం మారుస్తానన్న పవన్..!టీడీపీతో జత కట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? బీజేపీ-జనసేన పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇప్పుడంతా బాగానే ఉన్నట్టు…
టీడీపీ అధికారానికి దూరమై దాదాపు రెండున్నేళ్లు కావస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన నేతలంతా మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. కొద్దిరోజులుగా టీడీపీలోని కొందరు సీనియర్లు అధినేతపై ధిక్కార స్వరాన్ని విన్పిస్తుండటం…
ఏపీ సీఎం జగన్కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ రాసారు. ఇది రైతు ప్రభుత్వమా..? దగా ప్రభుత్వమా అంటూ ధూళిపాళ బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ లేఖలో… విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల్ని దొంగల్లా చూస్తున్నారన్న భావన కల్పిస్తున్నారు. రైతు భరోసా అమల్లో కులం పేరు చెప్పి లబ్దిదారుల్లో కోత విధించారు. రైతు భరోసా లబ్దిదారులను 64 లక్షల నుంచి 45 లక్షలకు కుదించారు. 15 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా…
గత నాలుగురోజులుగా ఏపీలో వాద, ప్రతివాదాలతో రాజకీయాలు దిగజరాయి అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వుండి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం పలాయనవాదం. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందింది. పేదప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగతోంది. సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతాము అని అన్నారు. ఇక…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి శంకరనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సినిమా కాల్షిట్లు లేకపోతే రాజకీయలు గుర్తుకు వస్తాయి అని కామెంట్ చేసారు. టీడీపీ, జనాసేన ఉనికి కోల్పోతున్న నేఫధ్యంలో రోడ్లు పై రాజకీయాలు చేస్తూన్నాయి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు ప్రక్కదారి పట్టించడంతోనే… రోడ్లకు ఈ దుస్థితి వచ్చింది అని ఆరోపించారు. సోము వీర్రాజుకు అవగాహన లేక కేంద్ర నిధులు ప్రక్కదారి పట్టాయని విమర్శిస్తూన్నారు. వచ్చే ఏడాది…
తెలుగు రాష్ట్రలో గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తోడు ఎగువ నుండి కూడా కొంత ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. అయితే ఇప్పటికే సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 63,080 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 6…