టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. మేం కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.. ఇక, బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు సజ్జల.. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.. మిగిలిన పార్టీలు…
టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, బాబు దీక్షపై సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అంటూ కామెంట్ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. 36 గంటలు కాదు.. 12 గంటలు కూడా ఆయన దీక్ష చేయలేరన్నారు. కేవలం అధికారం రాలేదనే సీఎం వైఎస్ జగన్‌ను పట్టుకుని నానా మాటలు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని…
బోషడీకే అనే పదానికి సీఎం తనకు కావాల్సిన అర్ధం వెతుక్కుంటున్నారు. బోష్ డీకే అని గుజరాత్ లోని ఓ గ్రామం ఉంది. ఆ పదానికి అమాయకులు అనే అర్ధం కూడా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల అన్నారు. ఏపీలో గంజాయి సాగు.. సరఫరా జరుగుతోందంటూ పక్క రాష్ట్రం డీజీపీనే అంటున్నారు. పక్క రాష్ట్రం సీఎం గంజాయి విషయంలో తీసుకుంటున్న చర్యలు ఏపీ సీఎం తీసుకుంటే మేమూ హర్షిస్తాం. టీడీపీ కార్యాలయంపై దాడిలో సుమారు పది మంది…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. టీడీపీ కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీదే.. ఫిర్యాదు చేద్దామని డీజీపీకి ఫోన్లు చేస్తే స్పందించలేదని.. దీంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం అన్నారు..…
టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభమైంది.. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై దాడికి నిరసనగా.. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్షకు దిగారు చంద్రబాబు.. 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.. ఇక, దాడిపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ చీఫ్.. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఏపీ టీడీపీ అధ్యక్శుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు.. పార్టీ సీనియర్…
గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. విజయవాడలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ సమీర్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..…
టీడీపీ నేత పట్టాభికి ఏం జరిగినా డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పట్టాభి అరెస్ట్‌పై స్పందించిన ఆయన.. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి… కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేశారని.. దీంతో.. వీరు ప్రజల కోసం పనిచేసే పోలీసులు కాదని తేలిపోయిందన్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకీ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేసిన నారా లోకేష్..…
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా.. కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల పాటు దీక్ష కొనసాగించనున్నారు పార్టీ అధినేత.. మరోవైపు.. చంద్రబాబు దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు తమ్ముళ్లు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన…
రేపటి నుంచి 36 గంటల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గస్థాయిలో రెండు రోజులపాటు నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు.…
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం…