ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44, 086 శాంపిల్స్ పరీక్షించగా.. 523 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 608 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ…
ఏపీలో ఇప్పుడు ‘బోసడీకే’ అనే పదం చుట్టూ రాజకీయం అలుముకుంది. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను బోసడీకే అంటూ సంభోదించారు. ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. దీంతో వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అయితే బోసడీకే అనే పదం పెద్ద తిట్టు అని వైసీపీ నేతలు అంటుండగా.. ఈ పదానికి అర్థం ఏంటని పలువురు…
ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా రాజకీయ వేడి పులుముకుంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టగా అది రణరంగంగా మారింది. పలువురు ఆందోళనకారులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. అయితే ఈ అంశంపై మంత్రి కొడాలి నాని ఎన్టీవీతో మాట్లాడారు. ఇది కూడా చదవండి: పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష: డీజీపీ టీడీపీ కార్యాలయాలపై దాడులను తాను…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.. నిన్న టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. కొన్ని జిల్లా కార్యాలయాలపై కూడా దాడులు జరిగిన నేపథ్యంలో.. 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు టీడీపీ చీఫ్.. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలో ధ్వంసమైన వాహనాలు, ఫర్నిచర్ మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నారు చంద్రబాబు.…
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు.. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు ఇప్పుడు చిచ్చు పెడుతున్నాయి.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.. దీంతో, దాడులు, ఆందోళనలు, నిరసనలు, బంద్‌లకు వెళ్లిపోయింది పరిస్థితి. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.. అయితే, దానిని జీర్ణించుకోలేక నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్ చూపించారని.. దాని ప్రభావం…
టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసగా.. ఓవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా… మరోవైపు.. టీడీపీ బంద్ కు నిరసనగా వైసీపీ కౌంటర్‌గా కార్యక్రమాలను పూనుకుంది… ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు చేపట్టాలి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని…
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ట్రిపుల్‌రెడ్డి దారెటు? రెండు దఫాలుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎందుకు బరిలో దిగాలని అనుకుంటున్నారు? ఏ పార్టీనో స్పష్టత ఇవ్వకుండా గాలివాటాన్ని నమ్ముకున్నారా? ఇంతకీ ఎవరా ట్రిపుల్‌రెడ్డి? 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎల్ ప్రకటన..! దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగి.. సడెన్‌గా పాలిటిక్స్ వద్దని అనుకుని 2014 ఎన్నికల్లో సైలెంట్ అయ్యారు మాజీమంత్రి దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. ఇంటి పేరును కలిపి ఇలా మొత్తంగా…
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు.…
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ జిల్లా పోలీసులు నోటీసులు పంపడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీసీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు వైసీపీతో సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు.…