ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 514 శాంపిల్స్ పరీక్షించగా.. 191 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 416 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,00,31,083 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,286 కు పెరిగింది.. ఇక, 20,53, 134 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,418 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 2,734 గా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.