ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో.. వెంటనే ఆయనను చికిత్స కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బిశ్వభూషన్.. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే, ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి..? ప్రస్తుతం ఎలా ఉన్నారు.. ఏ చికిత్స జరుగుతోంది..? లాంటి విషయాలు మాత్రం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలియనున్నాయి. ఆయన వయస్సు 87 సంవత్సరాలు.. 2019లో ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.