ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే రేపు (బుధవారం) రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం.. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే.. కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేయగా.. ఒకే రోజు 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు తీసుకొచ్చి.. ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
Read Also: నరసాపురం పర్యటనకు సిద్ధమైన జనసేనాని
ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్‌బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ, ఏపీ విద్యా చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్సిటిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్సిటిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట రెండో సవరణ, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ బొవైన్ బ్రీడింగ్ చట్ట సవరణ, ఏపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్ కార్పోరేషన్ల చట్ట సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.