బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. బద్వేల్…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని ఆరోపించారు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేదా వాళ్ల ఆఫీసు పగల గొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో స్పష్టత కరువైందన్నారు. అసలు ఢిల్లీ పర్యటనలో ఆయన్ను పలకరించేవారే లేరని ఎద్దేవా చేశారు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు…
టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ దాడులు జరిగాయి.. ఇక, ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇవాళ టీడీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు ఇచ్చారు.. కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ…
మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు..? ఇప్పుడే రాజీనామా చేస్తున్నానంటూ ఎన్టీవీ ఇంటర్వ్యూలో సవాల్ విసిరారు.. అంతేకాదు.. ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చారు.. తాను రాజీనామా చేస్తున్నట్టు రాసి స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు.. తాను పరిటాల సునీతను వదినగానే చూస్తాన్న వంశీ.. కానీ, తల్లికి, గర్బస్థ శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగినంత తెలివైన…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే… విశాఖ టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం నుంచి విశాఖ బయలు దేరాల్సి ఉంది. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లై ఓవర్ తో పాటు.. వీఎంఆర్డీఏ పూర్తి చేసిన 6…
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి, కేంద్రమంత్రులకు చంద్రబాబు వివరించనున్నారు. ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరనున్నారు. Read Also: విశాఖ టూర్… వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్ కాగా వైసీపీ కార్యకర్తలు…
రాజోలు వైసీపీకి కోఆర్డినేటర్ కావాలట. పార్టీ సీనియర్ నేతలే అధిష్ఠానాన్ని కోరినట్టు టాక్. వాస్తవానికి అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నారు. మరోపార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సైతం వైసీపీకి సాయం పడుతున్నారు. అయినప్పటికీ ఎందుకు ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది? అసలు రాజోలు వైసీపీలో ఏం జరుగుతోంది? రాజోలు వైసీపీలో హైడ్రామా..! తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ కోఆర్డినేటర్ పెద్దపాటి అమ్మాజీ కొద్దిరోజులుగా రాజోలుకు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారట.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శనివారం నాడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా జగన్ హాజరుకానున్నారు. ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా అంతకుముందు విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. Read Also: సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా సీఎం జగన్ తొలుత…
ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని…
ఏపీలో కరోనా క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,494 శాంపిల్స్ పరీక్షించగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 574 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,91,85,656 కు పెరిగింది.. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,62,781 కు పెరగగా.. రివకరీ…