బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకోనుంది. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఓటమిని ఊహించి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో బద్వేల్ వైసీపీ అభ్యర్థి గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తోంది. అయితే అనుహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీలో నిలిచాయి. బీజేపీ తరుఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేల్ లో ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ప్రచారం ముగియడానికి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాలు వదిలేస్తారా..? అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్.. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో..? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు హితవుపలికిన ఏపీ మంత్రి… హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అంటూ హాట్ కామెంట్లు చేశారు పరిటాల సునీత.. మాలో ప్రవహించేది సీమ రక్తమే నన్న మాజీ మంత్రి.. నా భర్తను చంపినప్పుడు కూడా.. చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇక, ఇప్పటికైనా చంద్రబాబు మీరు మారాలి అంటూ పరిటాల సునీత సూచించారు.. ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇంకా ఓపికతో…
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. మాటల యుద్ధమే కాదు.. చివరకు దాడులకు వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, ఇప్పుడు ఓవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వ్యవహారశైలికి వ్యతిరేకంగా కౌంటర్ దీక్షలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు.. శనివారం రోజు ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దృష్టికి దాడుల విషయాన్ని తీసుకెళ్లిన…
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ఇవాళ ముగియనుంది.. గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు చంద్రబాబు.. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల దాడులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అంటూ పేరు పెట్టారు.. గురువారం ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష…
ఏపీలో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. కానీ అధికారికంగా వైసీపీలో చేరలేదు. అలా చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది. అప్పుడు అనర్హత వేటు పడే అవకాశముంటుంది. దీంతో ఆయన జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. Read Also: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. వైసీపీపై ఫిర్యాదు ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టగా…
టీడీపీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ హరిచందన్‌ను గురువారం సాయంత్రం టీడీపీ నేతల బృందం కలిసింది. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దాడులపై వీడియో ఫుటేజీని కూడా గవర్నర్ కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు.…
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో పలు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. Read Also: బద్వేల్ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్…
వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. కరోనా ఎంట్రీతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ఏపీలో సంక్షేమ పథకాలు ఏమాత్రం ఆగలేదంటే ఆ క్రెడిట్ మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. ఇలాంటివి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు సంయమనం కోల్పోయి వైసీపీపై బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కొద్దిరోజులుగా ఏపీలో…
ఆ జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏ గొడవ జరిగినా.. అధిష్ఠానం పేరుతో ఒక లెటర్ వస్తుంది. అందులో ఊరు పేరు.. మ్యాటర్ ఉంటుంది. ఎందుకు పంపిస్తున్నారు.. ఎవరికి పంపిస్తున్నారో వివరాలు కనిపించవు. కానీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంతకీ ఆ లేఖల ఆంతర్యం ఏంటి? ఇప్పటికే అనంతలో జేసీ వర్సెస్ టీడీపీ పాత నేతలు..! అనంతపురం జిల్లా టీడీపీలో కొన్నిరోజులుగా వర్గ విబేధాలు ఒక రేంజ్లో సాగుతున్నాయి. గతంలో నియోజకవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉండేది.…