సర్పంచ్ భర్తపై తిరుగుబాటు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీకి చెందిన సర్పంచ్ భర్తపై వార్డ్ మెంబర్ తిరుగుబాటు చేసిన ఘటన రేపల్లె నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే
గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి పంచాయతీకి చెందిన 8వ వార్డ్ మెంబర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. సర్పంచ్ భర్త ఇమ్మానియేల్ .. తనను ఐదు నెలలుగా అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ ఉప్పూడి ఎనిమిదో వార్డ్ మెంబర్ పీ.హరీష్ బాబు లేఖలో పేర్కొన్నాడు. తన భార్యకు డ్వాక్రా యానిమేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు నెలలుగా ఇమ్మానియేల్ తిప్పించకున్నాడని హరీష్ బాబు చెప్తున్నాడు. ఐదు నెలల తర్వాత నీకు బ్యాగ్రౌండ్ లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో ఉద్యోగం ఇప్పించేది లేదని.. సర్పంచ్ భర్త ఇమ్మానియేల్ తనను హేళన చేసినట్లు దళితుడైన పీ.హరీష్ బాబు బహిరంగ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈలేఖ రేపల్లె నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
సర్పంచ్ దంపతుల అరాచకాలు
Also Read
మరోవైపు ఉప్పూడి సర్పంచ్ దంపతులు పంచాయతీలో అరాచకాలు సృష్టిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మాట వినని వారిపై సర్పంచ్ భర్త తప్పుడు కేసులుతో వేధిస్తున్నట్లు చెప్తున్నారు. తమను దిక్కరిస్తే.. పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు ఆపేస్తామని.. ఉపాధిహామీ పనులు, డ్వాక్రా గ్రూపల నుంచి తొలగిస్తామని సర్పంచ్ దంపతులు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గ్రామస్థులు చెప్తున్నారు. ఎదురుతిరిగితే తమకు పెద్దల అండ దండలు ఉన్నాయనీ తమతో పెట్టుకోవద్దని సర్పంచ్ దంపతులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుత సర్పంచ్ పై గ్రామస్థులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందే సర్పంచ్ కు ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాచి చట్టాన్ని మోసం చేశారని గ్రామస్థులు చెప్పారు. ప్రస్తుతం రేపల్లె కోర్టులో కేసు నడుస్తున్నట్లు చెప్తున్నారు. చట్టాన్ని మోసం చేస్తూ.. గ్రామస్థులను బెదిరించటం ఏంటని ఉప్పూడి పంచాయతీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- Tags
- Andhra Pradesh
- sarpanch
- ycp
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్కు రెడీ..!